మోదీ @ 3.0 సెల్ఫీలు
Modi @ 3.0 selfies
రోమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ @ 3.0 పదవీలో వచ్చాక ప్రపంచదేశాల్లో ఏ మాత్రం మోదీ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. జీ–7లో భారత్ భాగస్వామ్య దేశం కానప్పటికీ ప్రత్యేకంగా మోదీ చరిష్మాతోనే భారత్ కు ఆహ్వానం లభించిందనే చెప్పాలి. ఆయన విదేశీ మంత్రం ఫలించింది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడ్డారనే చెప్పొచ్చు. మరోవైపు జీ–7దేశాల సమావేశం అయినప్పటికీ మోదీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నట్టనడుమ మోదీతో బాటు ఫోటోలు దిగడం విశేషం.
ఇటలీ పీఎం మెలోని మోదీతో సెల్ఫీ దిగారు.
సమ్మిట్ మధ్య మోదీ యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో కలిసి ఫొటోలు దిగారు.
ఇటలీలోని క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. సంభాషణ సమయంలో, పోప్ మోడీ చేయి పట్టుకొని నడుస్తూ కనిపించారు. ప్రధాని పోప్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు.
జోర్డాన్ రాజు అబ్దుల్లాను మోదీ కలిశారు. రాజు అబ్దుల్లా మోదీని తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నట్లు తెలిపారు. మోదీతో కలవడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు.
జర్మనీ ఛాన్సలర్ ఒలోఫ్ స్కోల్జ్‌తోనూ మోదీ భేటీ అయ్యారు.
మోడీ, జపాన్ ప్రధాని కిషిదా మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. రక్షణ, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ఇరువురు నేతలు చర్చించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో కూడా మాట్లాడారు.