నిర్మల్ జిల్లా కలెక్టర్ గా అభిలాష అభినవ్

ప్రస్తుత కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డికి బదిలీ

Jun 15, 2024 - 13:54
Jun 15, 2024 - 15:45
 0
నిర్మల్ జిల్లా కలెక్టర్ గా అభిలాష అభినవ్

నా తెలంగాణ, నిర్మల్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగిన నేపథ్యంలో నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా కొనసాగుతున్న అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లా కలెక్టర్ గా రానున్నారు. తెలంగాణా కేడర్ కు చెందిన అభిలాష అభినవ్ బీహార్ లోని పాట్నాకు చెందినవారు. ఆరంభం నుంచి చదువుల్లో ప్రతిభను చూపుతున్న అభిలాష అభినవ్ సివిల్‌ సర్వీస్‌ పరీక్షల తొలి ప్రయత్నంలో  విఫలం అయ్యాక 2016లో రెండోసారి పరీక్షలో 308 ర్యాంక్‌ సాధించారు. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. నాగ్‌పూర్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారిగా 9 నెలలు పని చేశారు. 2017లో మూడోసారి సివిల్స్‌ రాసి జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌ అయ్యారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివిన అభిలాష అభినవ్ వాలీబాల్ ఛాంపియన్ గా కూడా పేరు పొందారు.