‘మోదీ 3.0’ 

శబ్ద  పోర్టల్​, ఏఐ టెక్నాలజీ ఫ్యాక్ట్​ చెక్​, ఫేక్​ న్యూస్​ అరికట్టడం భాగస్వామ్యం పెంపుదల దేశ, విదేశాల్లో ఉచిత డిష్​ సేవలు జన్​ సంవాద్​, భారత్​ నమన్ కార్యక్రమాలకు రూపకల్పన ఐజ్వాల్​ లో 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ప్రారంభానికి యోచన దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, కరస్పాండెంట్లు,  స్ట్రింగర్‌ల కు ఉద్యోగావకాశాలు

Apr 21, 2024 - 15:08
 0
‘మోదీ 3.0’ 

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​

దూరదర్శన్​ బ్రాండ్​ ను ప్రైవేటు మీడియా కంటే పటిష్ఠ పరచాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ‘గ్లోబల్​ మీడియా అండ్​ ఎంటర్​ టైన్​ మెంట్​ సమ్మిట్​’ని ప్రదాని మోదీ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో దూరదర్శన్​ లోగోను కొత్తగా రూపాంతరం చేశారు. దీన్ని విపక్షాలు పట్టుకొని రాద్ధాంతం సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సంస్థ దూరదర్శన్​. దేశ విదేశాల్లో చాలా వెనుకబడి ఉంది. దీని రేటింగ్​ కూడా చాలా తగ్గింది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రధాని నేతృత్వంలోని అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. 

ప్రసారభారతి ‘శబ్ధ’ అనే పోర్టల్​ విదేశీ అవుట్​ లెట్​ లతో సహా వెయ్యి కంటే ఎక్కువ మీడియా సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రసారభారతి గ్లోబల్​ ఏజెన్సీగా రూపాంతరం చెంది దేశ విదేశాల్లోనూ తన సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది.  అదే సమయంలో ప్రస్తుతం వస్తున్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ప్రాముఖ్యతనిస్తోంది. ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​ ద్వారా వస్తున్న ఫేక్​ న్యూస్​ లను కూడా ప్రసారభారతి అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటుంది. అదే ఏఐ టెక్నాలజీ సహాయంతో నూతన ఒరవడిని సృష్టించేందుకు సిద్ధమవుతోంది.సాధారణ పౌరులు కూడా ప్రసారభారతిలో భాగస్వామ్యం పొందేందుకు ‘భారత్​ నమన్​’ పోర్టల్​ ను ప్రారంభించబోతోంది. దేశవిదేశాల్లో 15 బ్యూరోలతో కలిసి ఈ చర్యలను చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది.

ఫ్యాక్ట్​ చెక్​ ద్వారా ఫేక్​ న్యూస్​ ను అరికట్టేలాని పలుమార్లు సభా వేదికల్లోనూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఫ్యాక్ట్​ చెక్​ తో ఏ ప్రాంతంలో జరిగే వార్తలోనైనా పారదర్శకతను స్థానిక భాగస్వామ్యం ద్వారా ప్రసారభారతి ప్రసారం చేయనుంది. దీంతో ఫేక్​ వార్తలు ప్రసారం చేసే వారి ఆటకట్టించినట్లవుతుంది. మరోవైపు దేశంలో అశాంతి, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఫ్యాక్ట్​ ద్వారా అడ్డుకట్ట పడనుంది. ప్రధాని మోదీ సూచన మేరకు ఇండియన్​ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ)లో మాస్టర్స్ కోర్సును ప్రారంభించనున్నారు. ‘మోదీ 3.0’ వెర్షన్​ కు సిద్ధమవుతున్నారు. పంచవర్ష ప్రణాళిక అమలులో కూడా సాంకేతిక వినియోగాన్ని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దూరదర్శన రంగు నీలం నుంచి నారింజకు మార్చారు. దీనినే ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 

డీడీ ఉచిత డిష్​ ద్వారా పొరుగు దేశాలకు కూడా సేవలను విస్తరించాలని భారీ ప్రణాళిక రూపొందించింది. ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివ్​ ఆఫ్​ ఇండియాలో గ్లోబల్​ బ్రాడ్​ లను కూడా తయారు చేసేందుకు రూపకల్పన చేసింది. అదే సమయంలో చానల్​ ల సంఖ్యను గణనీయంగా పెంచాలని భావిస్తోంది. దేశంలోని ఎన్నో పర్యాటక క్షేత్రాల అందాలను దేశ విదేశాల్లో ప్రసారం చేయాలని నిర్ణయించింది. భారత్​ లో జరిగే అన్ని రకాల అభివృద్ధి, యువత కొత్త ఆలోచనలు, సాంకేతికత, అన్ని రంగాలకు ప్రోత్సాహం లభించేలా దేశ విదేశాల్లో భారత్​ కీర్తి ప్రఖ్యాతులు మార్మోగిపోయేలా ప్రసారభారతి, దూరదర్శన్​ లు ప్రణాళికలు రూపొందుతున్నాయి. 

దూరదర్శన్​ అభివృద్ధితో టీవీ రంగంలో అపార ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, కరస్పాండెంట్లు,  స్ట్రింగర్‌ల అవసరం కూడా ఉండనుంది. దీంతో అత్యంత పారదర్శకమైన వార్తలను అందించనుంది. అదే సమయంలో ఫేక్​ వార్తలకు పూర్తిగా చెక్​ పెట్టనుంది. మోదీ హ్యాట్రిక్​ సాధించిన వంద రోజుల్లో ఐజ్వాల్​ లో 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్​ ప్రారంభించాలనే యోచనలో కూడా కేంద్రం ఉంది. 

ఏఐ టెక్నాలజీ ద్వారా నేరుగా ప్రధాని సందేశాన్ని జన్​ సంవాద్​, భారత్​ నమన్ అనే ప్రాజెక్టుల ద్వారా అందించనుంది. దీని ద్వారా ప్రజలకు ఉచిత యాక్సెస్​ లభిస్తుంది. అదే సమయంలో వినూత్న కంటెంట్​ ను కూడా పౌరుల నుంచి స్వీకరించనుంది. అన్ని భాషల కంటెంట్​ ద్వారా స్థానిక సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రోత్సాహం లభించనుంది. స్థానిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు మరిన్ని స్పష్టమైన వార్తలు ప్రసారం చేయనుంది. అదే సమయంలో వీడియోలు, పుస్తకాలు, విద్య, వైద్యం, డాక్యుమెంటరీలు, అటవులు, నీటి లభ్యత, రైతు సేవలు, ఆర్థిక రంగంలో ఉన్నతి, చిత్రాలు, వాణిజ్య, వ్యాపారాలు, వాతావరణం తదితర వివరాలన్నీ కూడా దూరదర్శన్​,ప్రసార భారతిలో ప్రసారం చేస్తూ దేశం నూతన అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా భాగస్వామ్యాన్ని నెలకొల్పనుంది.