మణిపూర్ శాంతికి మిజోరాం సీఎం ప్రయత్నం
Mizoram CM's effort for Manipur peace
ఇంఫాల్: మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా మణిపూర్ లో కుకీ–మొయిటీ కమ్యూనిటీల మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి కొల్పేలా కృషి చేయనున్నారు. సీఎం మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు వెళ్లనున్నట్లు ఆదివారం అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇరువర్గాల మధ్య మధ్యవర్తిత్వంపై ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. మణిపూర్ లో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దేలా ప్రయత్నాలు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి, నీతి ఆయోగ్ సమావేశంలో లాల్దూ హోమాను కోరారు. షా సమక్షంలో లాల్దూ హోమా, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ లు కలిసి సమావేశమై పలు విషయాలపై చర్చించారు. సమావేశం అనంతరం కుకి–జో ప్రతినిధి సంస్థ అయిన ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ ప్రతినిధులతో నేరుగా చర్చలు జరపాలని లాల్దుహోమా హోం మంత్రి షాకు సూచించారు.