నాలుగోసారి మోదీ ఖాయమే

విపక్షాల కుయుక్తులను తిప్పికొడతాం రూ. 75 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం చండీగఢ్​ లో కేంద్రమంత్రి అమిత్​ షా

Aug 4, 2024 - 15:23
 0
నాలుగోసారి మోదీ ఖాయమే

రాయ్​ పూర్​: విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా 2029లో పూర్తి మెజార్టీతో బీజేపీ (ఎన్డీయే) అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. నాలుగోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ సింహాసనాన్ని అధిష్టిస్తారని తెలిపారు. 

చండీగఢ్‌లోని మణిమజ్రాలో 24 గంటల పాటు నీటి సరఫరా చేసే ప్రాజెక్టును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. రూ.75 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల మోడరన్ హౌసింగ్ కాంప్లెక్స్, శివాలిక్ ఎన్‌క్లేవ్, ఇందిరా కాలనీ, శాస్త్రి నగర్‌లలో నివసించే వారితోపాటు మణిమజ్రాలోని లక్ష మందికి పైగా నివాసితులకు ప్రయోజనం చేకూరనుంది. 

ఈ సందర్భంగా  అమిత్​ షా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. మూడోసారి కంటే ఎక్కువ స్థానాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అస్థిరతను వ్యాప్తి చేయాలన్న విపక్షాల కుయుక్తులను తిప్పికొడతామన్నారు. మరోమారు విపక్షాలు ప్రతిపక్షంలో కూర్చునేందుకు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలన్నారు. 

మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశాన్ని సంక్షేమం దిశగా ముందుకు తీసుకువెళతామని అమిత్​ షా స్పష్టం చేశారు.