విద్యుదాఘాతానికి గురై ఎనిమిది ఎద్దులు మృతి

ఆదుకోవాలంటున్న రైతు కుటుంబం

Jun 7, 2024 - 21:14
 0
విద్యుదాఘాతానికి గురై ఎనిమిది ఎద్దులు మృతి

నా తెలంగాణ, డోర్నకల్​: విద్యుదాఘాతానికి గురై ఎనిమిది ఎద్దులు మృతి చెందాయి. శుక్రవారం మహబూబాబాద్​ లో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని చిన్నగుడూరు మండలం మంగోలిగూడెం గ్రామంలో పొలంలో మేత మేస్తున్న పశువులపై విద్యుత్​ స్తంభానికి ఉన్న సపోర్టింగ్​ వైర్​ తెగి మెయిన్​ వైర్లు కిందపడ్డాయి. వైర్లు పశువులపై పడడంతో అక్కడికక్కడే పశువులు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పశు యాజమానులు లబోదిబోమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. పశువుల విలువ రూ. 6 లక్షలని వాపోయారు. పశువుల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్న తమకు ఈ నష్టం కోలుకోలేని దెబ్బ అని వాపోయారు. ప్రభుత్వం, విద్యుత్​ అధికారులు వెంటనే స్పందించి తమకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్​ చేశారు.