నా తెలంగాణ, నిర్మల్: పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లి, బిడ్డలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడంతోన ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవోస్ హాల్ లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జాతీయ పోషణ కార్యక్రమలో కింద 926 అంగన్ వాడీ కేంద్రాలలో పోషణ అభియాన్ అము చేయాలన్నారు. గర్భిణీలు, బాలితలు, పిల్లలకు పాలు, గుడ్లు, పోష విలువలు కలిగిన ఆహారాన్ని ఇవ్వాలన్నారు. అంగన్ వాడీ, ఆశ సిబ్బంది సమన్వయంతో పరీక్షలు, పోషణ, ఆరోగ్య శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి చిన్నారి తగిన బరువు, ఎత్తు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తల్లిబిడ్డల సంపూర్ణ ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, వైద్యం, కిచెన్ గార్డెల ఏర్పాటు తదితరాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీడీవో నాగలక్ష్మి, వైద్యులు నయన రెడ్డి, సౌమ్య, సీడీపీవోలు, సూపర్ వైజర్లు, అధికారులు, కౌన్సిలర్లు, అంగన్ వాడీ సిబ్బంది, గర్భిణీలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.