మమత వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి నిర్మలా సీతారామన్
Minister Nirmala Sitharaman was furious over Mamata's comments
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చి బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రతిపక్షాల నుంచి కేవలం మమతా బెనర్జీ ఒక్కరే హాజరయ్యారు. తనకు త్వరగా వెళ్లాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆమెకు ముందే మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం తరువాత ఆమె మాట్లాడాల్సి ఉంది. దీంతో ఆమె పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని పలుమార్లు చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల మధ్య నుంచి ఆమె వెళ్లిపోయారని తెలిపారు. అందరికీ సమయం కేటాయించామన్నారు. సీఎం మమత సమయం అయిపోయిందని, మైక్ కట్ చేశారనే ఆరోపణలు పూర్తి అవాస్తవమని నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మమతా బెనర్జీ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇండీ కూటమి చర్యలను ఆమె ఇక్కడ ప్రదర్శించి ఉండవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. మమత వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.