1.4 లక్షలకు పెరిగిన స్టార్టప్ లు
మోదీ విప్లవాత్మక మార్పులతో సత్ఫలితాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో ప్రధాని మోదీ చేపట్టిన ఆర్థిక, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులతో వృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. శనివారం వరకు 1.4 లక్షలకు స్టారప్ లు పెరిగాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. దేశంలోని ప్రతీ రంగంలో స్టార్టప్ లు 2047 నాటికి ప్రపంచంలో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలిపారు. గత పదేళ్లలో స్టార్టప్ రంగం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
ప్రస్తుతం ప్రతీ రంగంలోనూ స్టార్టప్ లు పురోగతి సాధిస్తున్నాయన్నారు.
మెడ్ టెక్,ఫిన్ టెక్,ఆగ్రోటెక్,విమాన రంగం, డ్రోన్ లు, వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య, విద్య, పర్యాటక అనేక రంగాల్లో భారత్ లో వృద్ధి చెందిన స్టార్టప్ లు ప్రస్తుతం సత్తా చాటుతున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో సాంకేతిక రంగం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. స్టార్టప్ లు రూపుదిద్దడంలో దేశ యువత వినూత్న ఆలోచనలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. నూతన ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారని తెలిపారు. ఆయా స్టార్టప్ ల నిర్మాణంలో వయసుతో సంబంధం లేకుండా నిర్మితం కావడం అభినందనీయమన్నారు.
ఏఐ టెక్నాలజీ (కృత్రిమ మేథస్సు)పై కూడా స్టార్టప్ నిర్వాహకులు, వినూత్న ఆలోచనలు పంచుకుంటున్నవారు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గోయల్ కోరారు. స్టార్టప్ ల రూపకల్పనలో వృద్ధి సాధించేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టిందన్నారు. రుసుమును భారీగా తగ్గించిందన్నారు. స్టార్టప్ లు రూపొందించిన వారు ముందుగా పేటెంట్, కాపీరై, ట్రేడ్ మార్క్ లు నమోదు చేసుకునేలా ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు.
స్టార్టప్ రూపకల్పనలో ముందు వరుసలో గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడులుండగా, టాప్ ఫెర్మార్ లుగా మహారాష్ర్ట, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణలున్నాయి. లీడర్ షిప్ లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లు చోటు సంపాదించుకున్నాయి. ఉప నాయకత్వంలో బీహార్, హరియాణా లుండగా, ఎమర్జింగ్ ఎకోసిస్టమ్స్ లో ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లు చోటు సంపాదించుకున్నాయి.