క్రిస్మస్​ పర్వదిన శుభాకాంక్షలు

సిబిసిఐలో ప్రధాని మోదీ సుధీర్ఘ ప్రసంగం

Dec 23, 2024 - 20:57
 0
క్రిస్మస్​ పర్వదిన శుభాకాంక్షలు

పోప్​ ఫ్రాన్సిస్​ ను భారత్​ కు ఆహ్వానించాం
ఎంతోమంది భారతీయులను సురక్షితంగా విడిపించగలిగాం
క్రిస్మస్​ మార్కెట్​ లపై దాడి హేయమైన చర్య
కులమతాలకతీతంగా తమ విధానం
ప్రతీఒక్కరు దేశాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలబడాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచంలోని క్రైస్తవులందరికీ క్రిస్మస్​ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం న్యూ ఢిల్లీలోని సిబిసిఐ సెంటర్​ కాథలిక్​ బిషప్స్​ కాన్ఫరెన్స్​ ఆఫ్​ ఇండియా నిర్వహించిన క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. సిబిసిఐ స్థాపించి 80యేళ్లు గడుస్తుందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన సౌభాగ్యమన్నారు. ఇటలీలో జీ–7 సమ్మిట్​ సందర్భంగా పోప్​ ఫ్రాన్సిస్​ తో కలిసే అవకాశం దొరికిందన్నారు. గత మూడేళ్లలో రెండుసార్లు ఆయన్ను కలిశానన్నారు. ఆయన్ను భారత్​ రావాల్సిందిగా కోరానని తెలిపారు. సెప్టెంబర్​ లో న్యూ యార్క్​ లో కార్డినల్ పిట్రో పారోలిన్​ తో కూడా కలిశానన్నారు. ఈ ఆధ్యాత్మిక కలయికలో సేవా సంకల్పాన్ని మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్డినల్​ జార్జ్​ గువాకార్డ్​ ను సన్మానించే అవకాశం దక్కిందన్నారు. ఇది భారత్​ కు గర్వకారణమన్నారు. ఒక దశకం ముందు ఫాదర్​ అలిక్స్​ ప్రేమ్​ కుమార్​ ను సురక్షితంగా ఆఫ్ఘాన్​ నుంచి తీసుకువచ్చామన్నారు. 8 నెలల వరకు ఆయన అక్కడ బంధీలుగా ఉన్నారన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఆయన్ను క్షేమంగా తీసుకురాగలిగిందన్నారు. వారి కుటుంబంతో కూడా మాట్లాడానన్నారు. ఫాదర్​ టామ్​ యెమ్​ ను యెమెన్​ లో బంధీలుగా చేసుకున్నారన్నారు. ఈయన్ను కూడా భారత్​ విడిపించిందన్నారు. గల్ఫ్​ దేశాల్లో నర్సులు చిక్కుకుపోయినప్పుడు వారిని కూడా భారత్​ సురక్షితంగా విడిపించిందన్నారు. ఈ ప్రయత్నం కేవలం దౌత్యపరంగా చర్యలు తీసుకోలేదన్నారు. వీరంతా భారతీయులుగా భావించామని, అందుకే తమ కర్తవ్యాన్ని నిర్వహించామన్నారు. విదేశాల్లో బందీలుగా ఉన్న ఏ ఒక్క మత, కుల, వర్గ, వర్ణాల భారతీయులు ఉన్నా వారిని సురక్షితంగా విడిపించడంలో పూర్తి శక్తియుక్తులను వినియోగించామన్నారు. 

కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా 151 దేశాలకు మందులు, వ్యాక్సిన్​ లు పంపించామన్నారు. గయానా, కువైట్​ పర్యటనలో కూడా భారత్​ ప్రశంసలు పొందిందన్నారు. ఎన్నో దేశాలు భారత్​ ను ప్రశంసిస్తున్నాయన్నారు. భారత ఆలోచనా విధానాన్ని 21 శతాబ్ధంలో భారత్​ ను కొత్త దిశగా ప్రయాణింప చేస్తుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా మెలిగే మతాలపై ఉగ్రదాడులు జరగడం ఎంతమాత్రం సహించబోమన్నారు. జర్మనీ క్రిస్మస్​ మార్కెట్​ లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కొలంబోలోనూ ఇలాంటి దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండించారు. పవిత్ర గ్రంథం బైబిల్​ ఎప్పుడూ శాంతియుత బోధనలే చేస్తుందన్నారు.

గత పదేళ్లలో 25 కోట్ల మందిని నిరుపేదరికం నుంచి దూరం చేయగలిగామన్నారు. 10వ ఎకానమీ నుంచి ఐదో ఎకానమీ దిశగా దూసుకువెళ్లిందన్నారు. పదేళ్ల అభివృద్ధి యాత్ర రానున్న సమయానికి మరింత శక్తినిచ్చాయన్నారు. దీంతో విజయం దిశగా నూతన దారులు తెరుచుకున్నాయన్నారు. యువత ఆత్మవిశ్వాసంతో ప్రస్తుతం ముందడుగు వేస్తుందన్నారు. వికసిత్​ భారత్​ స్వప్నం సాకారం చేసే దిశగా యువత ప్రభుత్వానికి ధైర్యాన్నిస్తుందన్నారు. కార్మికులు, సాంకేతికత రంగాల్లో మహిళలు తమ సత్తా నిరూపించుకుంటున్నారన్నారు. ప్రతీ ఒక్క నిరుపేదకు ఇళ్లు, నీరు, విద్య, విద్యుత్​, ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. మహిళల స్వశక్తికి పూర్తిగా కట్టుబడి పనిచేశామన్నారు. అదే సమయంలో దివ్యాంగుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిచ్చామన్నారు. తమ ప్రభుత్వం వారిని సన్మానించే దిశగా అడుగులు వేసిందన్నారు. 3 కోట్ల మంది మత్స్యకారులు ఉన్నారన్నారు. ఫిషరీస్​ కోసం కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి అనేక చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. దీంతో కోట్ల మంది జీవన విధానంలో మార్పు తీసుకురాగలిగామన్నారు.

నిరుపేదలను ధనికులుగా చేయడంతో భారత్​ కూడా వృద్ధి సాధిస్తుందనే విషయాన్ని దేశం నమ్ముతుందన్నారు. దీంతో ఈ నిరుపేదలే దేశాభివృద్ధికి కీలక మూలస్తంభాలుగా నిలవనున్నారని తెలిపారు. పూర్తి ప్రపంచం కూడా భారత్​ విధానాలను గమనిస్తుందన్నారు. ఒకరి క్షేమాన్ని మరొకరు ఆలోచించాలనే బైబిల్​ చెబుతుందన్నారు. అందుకే సంఘంలో కీలకంగా నిలిచే భూమిక పోషిస్తున్నామన్నారు. జీసస్​ సూత్రాలు, బోధనలను పాటించడం వ్యక్తిగత, సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. తాము నివసిస్తున్న దేశ భవిష్యత్​ సువర్ణక్షరాల నిర్మాణంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.