ఢిల్లీ నుంచి మీరట్ కు నమో భారత్
నేడే ప్రారంభించనున్న ప్రధాని మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ నుంచి మీరట్ కు నమో భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. సాహిబాబాద్, న్యూ అశోక్ నగర మధ్య ఢిల్లీ మీరట్ నమో భారత్ 13 కి.మీ. కారిడార్ ను ప్రారంభిస్తారు. ఈ కారిడార్ లో 11 స్టేషన్లు, 42 కి.మీ. నుంచి 55 కి.మీలకు పెరుగుతుంది. దీంతో ఢిల్లీ నుంచి మీరట్ కు కేవలం 40 నిమిషాల్లో చేరిపోవచ్చు. ప్రాంతీయ రవాణాలో ఒక ముఖ్య అడుగుగా భావించొచ్చు. 2023న ఈ కారిడార్ ను ప్రారంభించగా ప్రస్తుతం మరో 13 కి.మీ. అదనపు మార్గాన్ని నిర్మించారు దీంతో దేశ రాజధానిలో హై స్పీడ్ రైళ్ల ప్రయాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఈ స్టేషన్ల ద్వారా వెళ్లే రైళ్లు ప్రతీ 15 నిమిషాల కు ఒకటి చొప్పున వెళతాయి. ఢిల్లీ నుంచి మీరట్ కు స్టాండర్డ్ కోచ్ లో ప్రయాణానికి రూ. 150, ప్రీమియం కోచ్ కు రూ 225 చార్జీగా నిర్ణయించారు. నమోభారత్ రైళ్లలో ఇప్పటివరకూ 50 లక్షల మందికిపైగా ప్రయాణించారు.