పనులు నత్తనడక సస్పెన్షన్​ తప్పదు

విమానాశ్రయ పనులపై గడ్కరీ హెచ్చరిక

Dec 23, 2024 - 20:13
 0
పనులు నత్తనడక సస్పెన్షన్​ తప్పదు

నాగ్‌పూర్: ఒక నెలలోగా నాగ్‌పూర్ విమానాశ్రయ పనులు పూర్తి చేయకపోతే అధికారులపై వేటు తప్పదని జాతీయ రహదారులు, రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ హెచ్చరించారు. సోమవారం నాగ్‌పూర్ విమానాశ్రయ రన్​ వేను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రన్​ వే పై రీ కార్పెంటింగ్​ పనులు నత్తనడకన సాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్​ పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఏఏఐ) అధికారులను మందలించారు. రన్​ వే పనులను మిహాన్​ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్​)​, ఏఏఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎంఐఎల్​ అధికారులు మే 2025 నాటికి ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల కోడ్​ వల్ల జాప్యం జరిగిందన్నారు. అక్టోబర్​ 8 నుంచి నవంబర్​ 23 వరకు పనులను వాయిదా వేయాల్సి వచ్చిందని లేదంటే పనులు మరింత ముందుకు కదిలేవని మంత్రి నితిన్​ గడ్కరీకి వివరించారు.