చైనా ప్రాజెక్టు భారత్​–అమెరికాల చర్చ

China project India-US discussion

Jan 4, 2025 - 18:30
 0
చైనా ప్రాజెక్టు భారత్​–అమెరికాల చర్చ

జనవరి 5, 6న ఢిల్లీలో అమెరికా విదేశాంగ శాఖ జాక్​ పర్యటన
ధోవల్​ తో భేటీ అయ్యే అవకాశం
బ్రహ్మపుత్ర ప్రాజెక్టుపై ఆరా
ఐఐటీలో ప్రసంగం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: చైనా అక్రమంగా నీటిని అడ్డుకునే ప్రాజెక్టులపై భారత్​ ఆందోళనకు ఇప్పుడు అమెరికా కూడా జతకట్టింది. దీంతో డ్రాగన్​ వ్యూహరచనను తిప్పికొట్టే చర్యలపై అమెరికా అధికారి జాక్​ సుల్లివ్​ ఎస్​ ఎస్​ ఎ అజిత్​ ధోవల్​ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి చేసిన త్రీ గోర్జెస్​ డ్యామ్​ వల్ల భూభ్రమణ వేగమే తగ్గింది. దీనిపైనే ఓ వైపు ఆగ్రహం వ్యక్తం అవుతుండగా, చైనా బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీంతో భారత్​ కు ఈ నది ద్వారా వచ్చే నీరు పూర్తిగా ఆగిపోనుంది. పైగా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగి గేట్లు తెరిస్తే ఒక్కసారిగా భారత్​ తీర ప్రాంతాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపైనే భారత్​ ఆందోళన వ్యక్తం చేస్తూ చైనా విదేశాంగ శాఖకు కూడా తమ సందేశాన్ని పంపింది.  

ఈ నేపథ్యంలో జాక్​ సుల్లివన్​ జనవరి 5, 6వ తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. చైనా నిర్మిస్తున్న డ్యామ్​ పై ఆరా తీయనున్నారు. ఆసియాలో చైనా చేపడుతున్న పలు కార్యక్రమాలపై కరోనా మహమ్మారి తరువాత ప్రపంచదేశాలు, యూఎన్​ (ఐక్యరాజ్యసమితి) ఓ దృష్టి వేసి ఉంచాయి. దీంతో చైనా చేపడుతున్న ప్రాజెక్టును ఎదుర్కొనేందుకు భారత్​ కు మరింత బలం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు విషయంలో భారత్​ తో సుల్లివన్​ చర్చిస్తారి అమెరికా విదేశాంగ శాఖాధికారులు తెలిపారు. అలాగే పర్యావరణ, వాతావరణ ప్రభావం, ఇండోపసిఫిక్​ ప్రాంతాల సమస్యలపై కూడా చర్చిస్తారని అన్నారు. అణు సహకారం, కృత్రిమ మేధస్సు, అంతరిక్షం, మిలిటరీ లైసెన్సింగ్​ వంటి అంశాలపై కూడా సుధీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది. జాక్​ సుల్లివన్​ ఈ పర్యటనలో దలైలామాను కలుస్తారని అనుకుంటుండగా ఆయన్ను కలవరని అమెరికా అధికారులు తెలిపారు. ఢిల్లీ ఐఐటీలో ప్రసంగం కూడా ఉంటుందన్నారు. 

కాగా టిబెట్​ లో బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్​ పనులపై భారత్​ తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది. చైనా చేపడుతున్న జలవిద్యుత్​ ప్రాజెక్టు 300 బిలియన్​ కిలోవాట్​ అవర్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల ప్రాజెక్టుకు చైనా గత నెల క్రితం ఆమోదముద్ర వేసింది.