బస్తర్ లో ఎన్ కౌంటర్ నలుగురు నక్సల్స్, ఒక జవాన్ మృతి
Four naxals, one jawan killed in encounter in Bastar
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ బస్తర్ లో భద్రత బలగాలు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి చెందగా, ఒక డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ కరమ్ మృతి చెందినట్లు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మృతి చెందిన నక్సల్స్ నుంచి ఏకే47, ఎస్ ఎల్ ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ్ పూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు అబూజ్ మడ్ లో శనివారం నుంచి భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేస్తున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ వైపు నుంచి కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.
డీఆర్జీ, ఎస్టీఎఫ్ వెయ్యిమంది నాలుగు జిల్లాల సరిహద్దు ప్రాంతాల నుంచి అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ చేపట్టారు. రెండు రోజుల క్రితం గరియాబంద్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సోర్నామల్ అడవుల్లో భద్రతా బలగాలు ముగ్గురు నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేశాయి. ఈ ఆపరేషన్ లో 300మంది సైనికులు పాల్గొన్నారు.