నైనిటాల్: ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతంలో మంటలు చల్లారడం లేదు. గత 24 గంటలుగా 23 చోట్ల కొత్త ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. దీనివల్ల 35హెక్టార్లలో అగ్నికీలలో చిక్కుకున్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి అగ్నికీలలు విజృంభిస్తుండడంతో ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత వారం రోజుల నుంచి మంటలు చెలరేగుతున్నా ఎందుకు చల్లార్చలేకపోతున్నారనే విషయాలను తెలుసుకున్నారు. అవసరమైతే మరింత కేంద్రాన్ని తీసుకుందామని అధికారులకు వివరించారు. మంటలు మరిన్ని చోట్లకు పాకకుండా అన్ని జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. బాగేశ్వర్‌లో, కాఫ్లిగేర్ మాగ్నసైట్ ఫ్యాక్టరీ గనుల కార్యాలయంలో మంటలతో 12 గదులు, యంత్రాలు, కంప్యూటర్లు కాలిపోయాయి. మరోవైపు ఎంఐ–17 హెలికాప్టర్ సహాయంతో అటవీ ప్రాంతంలో నీటిని వెదజల్లుతున్నారు. భీమ్‌తాల్ సరస్సు నుంచి 10 సార్లు హెలికాప్టర్‌లో నీటిని నింపి అడవుల్లోని భారీ మంటలను ఆర్పివేశారు.