ఆ..ఆ జంట మధ్య మంట
అ పేరుతో మొదలయ్యే అనన్య పాండే ...ఆ పేరుతో మొదలయ్యే ఆదిత్యరాయ్ కపూర్ మధ్య కొంత కాలంగా లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే...
అ పేరుతో మొదలయ్యే అనన్య పాండే ...ఆ పేరుతో మొదలయ్యే ఆదిత్యరాయ్ కపూర్ మధ్య కొంత కాలంగా లవ్ ట్రాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే...
అనన్య పాండే లైగర్ చిత్రంతో సౌతిండియాకి పరిచయమైంది. విజయ్ దేవరకొండ సరసన ఆరంభమే అవకాశం అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందింది. టాలీవుడ్ లో బిగ్ కెరీర్ ఆశించిన అనన్యకు చేదు అనుభవాన్ని మిగిల్చింది లైగర్.
అదంతా అటుంచితే, అనన్య ఇటీవలి కాలంలో సినిమాలతో కంటే ఎఫైర్ కథనాలతోనే ఎక్కువగా హైలైట్ అవుతోంది. అనన్య బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్ తో డేటింగ్ చేస్తోందని చాలా కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ జంట విదేశీ విహారయాత్రలు, ఔటింగులు, ముంబై ఔటర్ రిసార్టుల్లో షికార్లు వగైరా విషయాలు నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాయి.
రలోనే ఈ జంట పెళ్లికి సిద్ధమవుతోందని రెండు వారాలుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇంతలోనే ఈ జంట విడిపోయారంటూ మరో వార్త సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అనన్య క్రిప్టిక్ పోస్ట్ పుకార్లకు కారణమైంది. అనన్య పాండే ఒక నిగూఢమైన సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేయడంతో పుకార్లు మొదలయ్యాయి. అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ నుంచి విడిపోతోందని హిందీ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇన్‌స్టా స్టోరీతో కాకలు: ఇన్‌స్టాగ్రామ్ లో అనన్య ఒక నిగూఢమైన పోస్ట్‌ను షేర్ చేసింది. దీని సారాంశం ఇలా ఉంది. `ఇది నిజంగా మీ కోసం ఉద్దేశించినది అయితే అది మీ కోసం మాత్రమే.. నేర్చుకోగలిగే పాఠాలను మీకు నేర్పడం కోసం.. మీ వద్దకు మాత్రమే వస్తుంది. మీరు తిరస్కరణకు గురైనప్పటికీ... మీరు కూడా తిరస్కరించినట్టయితే.. అది నిజంగా ఉద్దేశించబడినదైతే.. ఇది ఎప్పుడూ నీలో భాగం కాదు. నీ ఆత్మ లోతుల్లో ఎప్పుడూ చిక్కుకోలేదు` అంటూ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది.
ఆలోచింపజేసే క్రిప్టిక్ పోస్ట్‌తో పాటు అనన్య మండే మానిఫెస్టింగ్ అనే క్యాప్షన్‌తో పాటు ధన్యవాదాలు తెలిపే ఎమోజి, బ్యాడ్ ఐ, నీలిరంగు సీతాకోకచిలుక ఈమోజీని జోడించింది. అనన్య ఇచ్చిన సిగ్నల్స్ అన్నీ బ్యాడ్ సిగ్నల్స్ గా కనిపిస్తున్నాయి. తన లవ్ లైఫ్‌లో ఏదో అల్లకల్లోలం మొదలైందని సూచిస్తున్నాయి అంటూ అభిమానులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై గుసగుసలు మొదలయ్యాయి. గత సంవత్సరం, కాఫీ విత్ కరణ్‌లో కనిపించిన సమయంలో ఆదిత్య తన డార్లింగ్ అనన్యను స్వచ్ఛమైన ఆనందం, `బ్లిస్ అని అభివర్ణించారు.
ఈ స్థితితో మీరు సంతోషంగా ఉన్నారా? అని కరణ్ అడిగినప్పుడు, ఆదిత్య ఉల్లాసంగా `అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను` అని సమాధానమిచ్చాడు. కానీ అనన్యతో డేటింగ్ ని కన్ఫామ్ చేయలేదు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనన్య చివరిగా ఓటీటీ చిత్రం `ఖో గయే హమ్ కహాన్`లో కనిపించింది. కంట్రోల్, దర్బార్, శంకర వంటి సినిమాలు చేస్తోంది. కాల్ మీ బే అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. మరోవైపు ఆదిత్య తదుపరి సారా అలీ ఖాన్‌తో కలిసి మెట్రో ఇన్ డినోలో కనిపించనున్నారు