యశోద లాంటి పాత్ర చేయాలని ఉంది

ప్రేమకథా చిత్రాలతో పాటు థ్రిల్లర్‌ మూవీస్‌లో నటించాలనుంది. ప్రతీ సినిమాలో నటనాపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది సాక్షి వైద్య.

Apr 12, 2024 - 15:52
 0
యశోద లాంటి పాత్ర చేయాలని ఉంది

ప్రేమకథా చిత్రాలతో పాటు థ్రిల్లర్‌ మూవీస్‌లో నటించాలనుంది. ప్రతీ సినిమాలో నటనాపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది సాక్షి వైద్య. ‘ఏజెంట్‌’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది. రెసెంట్గా ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో వరుణ్‌తేజ్‌ సరసన నటించింది.

అయితే ఆ చిత్రం ఆశించినంతగా ఆడలేదు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తాను అన్ని జోనర్‌ చిత్రాలను ఇష్టపడతానంటోంది. ‘యశోద’ చిత్రంలో సమంత లాంటి పాత్ర చేయాలన్నది తన డ్రీమ్‌ అంటోంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. నటిగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. తెలుగు భాషను నేర్చుకొని అభిమానులకు ప్రేమను తిరిగి ఇస్తానంటోంది. ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ కి మలయాళం లోనూ ఆఫర్లు వస్తున్నాయి