మెడికో హత్య క్షమించరాని పాపం

Medico murder is an unforgivable sin

Aug 25, 2024 - 17:08
Aug 25, 2024 - 17:08
 0
మెడికో హత్య క్షమించరాని పాపం
  • భరతం పడతాం
  • మహిళలపై నేరాలకు ఉరి, జీవితఖైదు
  • చట్టాలకు మరింత పదును
  • దేశవ్యాప్త ఆక్రోశం, ఆవేదన, ఆందోళన సమంజసమైనవే
  • అసమానతలను రూపుమాపుతాం
  • దేశాభివృద్ధిలో లక్పతీ దీదీల భాగస్వామ్యం కీలకం
  • రూ. 2500 కోట్లు కేటాయింపు
  • ధైర్యానికి, సహనానికి ప్రతీక మహిళలు
  • మహామహిళలు ఆర్థికంగా సత్తా చాటుతున్నారు
  • పోలాండ్ లో మహారాష్ట్ర వాసులకు ప్రత్యేక గౌరవం
  • నేపాల్ ప్రమాదంపై విచారం
  • జల్గావ్ లక్పతీ దీదీ సమావేశంలో నరేంద్ర మోదీ

ముంబై: కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా మహిళలు, యువతుల మానసిక వేదన, బాధ, ఆక్రోశం సమంజసమైనవే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అత్యంత ఘటన దురదృష్టకరమై ఉంది. ఈ ఘటనపై తనకు కూడా తీవ్ర ఆగ్రహం. ఈ దుస్సాహసానికి సంబంధించిన వారిని వదిలేది. ఇది క్షమించరాని పాపం అన్నారు. ఈ తరహా నేరాలను తమ ప్రభుత్వం క్షమించదన్నారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ, ప్రభుత్వాలకు ఈ వేదిక ద్వారా తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని అన్నారు. దోషులు ఎవరైనా విడిచిపెట్టేది లేదు. సహాయ పడ్డ వారిని కూడా కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. దేశంలోని మహిళలపై ఏ వ్యవస్థనైనా మహిళల భద్రత పట్ల జవాబుదారీగా ఉండాని మోదీ స్పష్టం చేశారు. మహిళలను గౌరవించే దేశంలో వారి మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 

మహిళలు, యువతులు, కూతుళ్లపై కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ తరహా నేరాలకు మరణశిక్ష, జీవిత ఖైదు విధిస్తామన్నారు. ఈ మేరకు భారత ఐపీసీ చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఓ వైపు దేశంలోని మహిళల సాధికారత, అభివృద్ధిలో భాగస్వామ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటుంటే మహిళలపై దాడులు లాంటి చర్యలు అనేక అసమానతలకు దారి తీస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సంకల్పించిన లక్పతీ దీదీ లక్ష్యాలను చేరుకుంటున్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఆసుపత్రులు, యువత ఆఫీసులు, పాఠశాలలు ఇలా ఏ ఒక్కచోటైనా మహిళలు, బాలికలను వేధించే వారి భరతం పట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. 

మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఆదివారం నిర్వహించిన లక్పతీ దీదీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. సదస్సుకు విచ్చేసిన ప్రధానికి మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. మూడో విడత లక్పతీ దీదీ కార్యక్రమం సందర్భంగా 11 లక్షల మంది మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఆర్థిక లక్షాన్ని సాధించిన మహిళలతో ప్రధాని మాట్లాడి వారిని అభినందించారు. దేశంలో ఉన్న మహిళలు భారత భాగస్వామ్యంలో కీలక భూమిక పోషించడం సంతోషకరమన్నారు. అదే సమయంలో మహారాష్ర్ట దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని హర్షం వ్యక్తం చేశారు. 

మహారాష్ట్రలో 48 లక్షల మంది సభ్యులతో 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ. 250 కోట్ల నిధిని విడుదల చేసారు. దీని ద్వారా మరింత మంది మహిళలను లక్పతీదీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. ఈ పథకంలో భాగస్వాములను మహిళలు యేటా లక్ష రూపాయలు సంపాదించడానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రధాని విడుదల చేసిన ఈ నిధులతో 25 లక్షల మంది మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు లక్పతీ దీదీ కింద రూ. 6 వేల కోట్లను విడుదల చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. 

మహిళలు మహారాష్ట్ర పేరును దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టాలన్నారు. మహారాష్ర్ట మహిళలు ధైర్యానికి, సహానానికి ప్రతీకలుగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇక్కడి మహిళల సంపాదన కేవలం ఈ ఏర్పాటు కాదని మొత్తం దేశం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సంపద అని ప్రధాని మోదీ కొనియాడారు. మహిళలకు ఇంతపెద్ద యెత్తున దేశంలో ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమం స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి ఏ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ తమ ప్రభుత్వం ఈ పనిని అమలు చేసి లక్ష్యాలను కూడా చేరుకుంటుండంపట్ల హర్షం వ్యక్తం చేశారు. 

మహిళలకు ఆర్థికంగా స్వావలంబన దిశగా చర్యలు తీసుకునేందుకు వారి పేరుతో ప్రభుత్వం నిర్మించే ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు. 4 కోట్ల ఇళ్లను మహిళలకు కేటాయించారు. 3 కోట్ల ఇళ్లను కేటాయించాలని మరో లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బ్యాంకు వ్యవహారాలు, ఆధునిక వ్యవసాయం, డ్రోన్ ద్వారా వ్యవసాయంతో మహిళలు వ్యవసాయ రంగంలో తమ సత్తా చాటుతున్నారు. భారత్ మహిళా శక్తికి నిదర్శనమని, ఆదిశక్తి అంటే భారత్ అని ప్రతీ ఒక్కరూ మాట్లాడుకునేలా ప్రధాని పునరుద్ఘాటించారు. 

ఇటీవల తాను పోలాండ్ పర్యటన చేపడితే అక్కడి ప్రజలు మహారాష్ర్ట ప్రజలను ఎంతో గౌరవిస్తారనే విషయం అర్థమైంది. అక్కడి రాజధానిలో కొల్హాపూర్ మెమోరియల్ ఉంది. ఈ స్మారక చిహ్నం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎంతోమంది పోలాండ్ వాసులకు కొల్హాపూర్ రాజ కుటుంబం ఆశ్రయం కల్పించిన ప్రధాని మోదీ ఊటంకించారు. 

నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మహారాష్ర్టకు చెందిన వారు ప్రదర్శించడం పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సల కోసం ఏర్పాటు చేశామన్నారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.