బిహార్​ ఎన్నికల్లో జేఎస్పీ

JSP in Bihar elections

Aug 25, 2024 - 17:27
 0
బిహార్​ ఎన్నికల్లో జేఎస్పీ
  • శంఖారావం పూరించిన ప్రశాంత్​ కిషోర్​
  • మహిళలకు 40 సీట్ల కేటాయింపు
  • ప్రత్యేక శిక్షణ ద్వారా రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించే దిశగా చర్యలు
  • అసెంబ్లీ ఎన్నికలకు జేఎస్పీ బ్లూ ప్రింట్​ సిద్ధం

పాట్నా: బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు జన్​ సూరజ్​ పార్టీ (జేఎస్​పీ) చీఫ్​ ప్రశాంత్​ కిషోర్​ శంఖారావాన్ని పూరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామన్నారు. తమ పార్టీ తరఫున 40 మంది మహిళా అభ్యర్థులను అసెంబ్లీకి పంపే లక్ష్​యంతో ఉన్నామన్నారు. ఆదివారం ప్రశాంత్​ కిషోర్​ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు. కొద్ది కాలంగా ఈయన బిహార్​ లోని అన్ని జిల్లాలను సందర్శిస్తున్నారు. అక్కడి స్థానిక నాయకులతో సమస్యలు, పరిష్​కార మార్గాలు, బలమైన నాయకులను కలుస్తూ తెలుసుకుంటూ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. 2030 నాటికి జేఎస్పీ తరఫున 70 నుంచి 80 మంది మహిళలను అసెంబ్లీకి పంపడమే తమ లక్ష్యమన్నారు. 2025లో 243 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. మహిళలను రాజకీయాల్లో భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని లీడర్​ లా రూపొందిస్తామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంభన వస్తే తప్ప రాజకీయాల్లో వారి భాగస్వామ్యం సాధ్యం కాదని ప్రశాంత్​ కిషోర్​ అభిప్రాయపడ్డారు. 

బిహార్​ నుంచి వలసలను పూర్తిగా నిరోధించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆ దిశగానే తమ పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. కేవలం రూ. 10, రూ. 12వేల కోసం ఇక్కడి ప్రాంత వాసులు ఈ ప్రాంతాన్ని వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తానన్నారు. వారందరికీ ఇక్కడే ఉపాధి లభించేలా తమ పార్టీ చర్యలు తీసుకుంటుందని ప్రశాంత్​ కిషోర్​ స్పష్టం చేశారు. బిహార్​ అభివృద్ధికి సంబంధించి పూర్తి బ్లూ ప్రింట్​ ను జేఎస్పీ సిద్ధం చేసిందని, రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నేతలను చూసి ఏ ఒక్కరూ ఓటు వేయబోరన్నారు. విశ్వసనీయత, నమ్మకం, రాజకీయాల్లో మహిళల అత్యధిక ప్రాధాన్యతను చూసి ఓటేసేలా జేఎస్పీ చర్యలు తీసుకుంటుందని ప్రశాంత్​ కిషోర్​ ప్రకటించారు.