ముంబాయి: అశ్లీల చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబాయిలోని ఇళ్లపై ఈడీ శుక్రవారం ఉదయం దాడులు చేసింది. కుంద్రా కార్యాలయం, ముంబాయితోపాటు యూపీలోని 15 చోట్ల ఈ కేసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈడీ తనీఖీల్లో అశ్లీలతకు సంబంధించిన పలు మొబైల్స్, కంప్యూటర్ సామాగ్రిని ఈడీ స్వాధీనం చేసుకుంది. రాజ్ కుంద్రాపై అశ్లీల కంటెంట్ అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. యాప్ ద్వారా ఆయన ఈ ప్రసారాలు చేశారని ఈడీ ఆరోపిస్తుంది. 2021లో ఈ పోర్న్ రాకెట్ ను పోలీసులు చేధించారు. ఈ కేసులో రాజ్ కుంద్రాతోపాటు టీవీ నటి గెహానా వశిష్ట పేరు కూడా తెరపైకి వచ్చింది. రాజ్ కుంద్రా సంస్థలో పనిచేస్తున్న ఉమేష్ కామత్ ద్వారా ఈ వీడియోలు షేర్ చేస్తూ లండన్ లోని ఆయన బావమరిది ప్రదీప్ బక్షికి పంపేవాడని ఈడీ తెలిపింది. సోషల్ మీడియా మాధ్యమంగా అశ్లీల కంటెంట్ ను పంపేవారని గుర్తించారు. వీరు వినియోగిస్తున్న యాప్ లకు భారీ ఎత్తున చెల్లింపులు చేసినట్లుగా గుర్తించారు. చెల్లింపులపై ఆయా సంస్థల ద్వారా వివరాలను ఆరా తీస్తున్నారు. అశ్లీల వ్యాపారం ద్వారా రాజ్ కుంద్రా భారీ ఎత్తున డబ్బు పోగేసుకున్నారనే ఆరోపణలున్నాయి.