మహిళలు బహిరంగంగా మాట్లాడొద్దు
తాలిబన్ లో ఆంక్షలు
కాబూల్: తాలిబాన్ లో రోజురోజుకు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. మహిళలు బహిరంగం మాట్లాడొద్దని తాలిబాన్ తాజా ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలతో ఆప్ఝాన్ లో మహిళల జీవితాలు ఎంత దుర్భరంగా కొనసాగుతున్నాయనే విషయం అర్థమవుతోంది. ఆఫ్ఘాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగడం, తాలిబాన్ ఆఫ్ఘాన్ ను హస్తగతం చేసుకోవడం అటు పిమ్మట లేనిపోని చట్టాలన్నీ ప్రజలపై రుద్దడంతో అక్కడి ప్రజల జీవితం నానాటికి అగాథంలోకి వెళుతోంది. పలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల ప్రకారం ఆఫ్ఘాన్ లో వృద్ధులు, మహిళలు, పిల్లల జీవితాలను తాలిబాన్ నియంత్రిస్తోంది. తాము నిర్దేశించుకున్న చర్యలను అమలు చేసేందుకు హింసనే ప్రధాన ఆయుధంగా వాడుతోంది. ఈ రకమైన నియమ నిబంధనలను అమలు చేయడం పట్ల ఇస్లామిక్ ధర్మాన్ని కాపాడుతున్నామని పలువురు చెప్పడం విశేషం.