విద్యుత్ సమస్యలు రానీయొద్దు

విద్యుత్ సరఫరాలో ఉన్న అపోహలను మీరే తొలగించాలి గృహజ్యోతి లబ్ధిదారులకు అన్నివిధాల సహకరించండి విద్యుత్ అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Aug 17, 2024 - 17:40
 0
విద్యుత్ సమస్యలు రానీయొద్దు

నా తెలంగాణ, షాద్ నగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరంతర విద్యుత్​ సరఫరా జరుగుతోందని షాద్​ నగర్​ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​ అన్నారు. రాష్ర్టంలో విద్యుత్​ కొరత అనేది లేకుండా నాణ్యమైన విద్యుత్​ ను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 

శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్​ అధికారులు, సిబ్బంది సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ విద్యుత్ కు  డిమాండ్ అధికంగా ఉన్నా, నిరంతరం అధికారులు విద్యుత్​ ను అందించడం అభినందనీయమన్నారు. సాంకేతిక లోపాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు. గృహజ్యోతికింద నిరుపేదలకు నిరంతరంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ ను అందించడం సంతోషకరమన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలందరికీ లభిస్తుండడంతో విపక్షాలు చూసి ఓర్వలేక లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. విద్యుత్​ పై తప్పుడు ఆరోపణలకు పాల్పడిన వారికి ఎప్పటికప్పుడే సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో డిఈ యాదయ్య, ఈడి రవీందర్, ఏడి రవీందర్, మాధవరావు ఏఈలు వినోద్ కుమార్, రాకేష్ గౌడ్, ఈశ్వరయ్య, రవికుమార్, సాయికుమార్, నరేందర్ విద్యుత్ సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, జంగా నరసింహులు యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.