వరుస ఉగ్రదాడులపై మాయావతి మండిపాటు

హిందువులనే లక్ష్యంగా చేసుకొని దాడులు రక్షణ విషయంలో రాజకీయాలొద్దు 

Jun 12, 2024 - 19:24
 0
వరుస ఉగ్రదాడులపై మాయావతి మండిపాటు

లక్నో: జమ్మూ కాశ్మీర్​ లో జరుగుతున్న వరుస ఉగ్రదాడులపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాడులను తీవ్రంగా ఖండించారు. రియాసీ, దోడా, కథువా దాడులను చూస్తుంటే ఒక వర్గం ప్రజలనే (హిందువుల)నే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. హిందువుల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాదులు కుటీల యత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దాడులు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం, భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యలు చురుగ్గా ఉన్నాయన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు తగదని తాను అభిప్రాయపడుతున్నట్లు మయావతి ప్రకటించారు.