బీజేపీ నాయకులే టార్గెట్ మౌల్వీ అరెస్టు.. విచారణలో విస్తుపోయే నిజాలు
కోటి రూపాయల సుపారీ పాక్, నేపాల్ లతో ఆయుధాల కొనుగోలు ఐదు దేశాలతో సంప్రదింపులు భారత జెండాపై అసభ్యకర వ్యాఖ్యలు
గాంధీనగర్: బీజేపీ నాయకుల హత్యకు మదర్సా ఉపాధ్యాయుడు మౌల్వీ మహమ్మద్ సోహెల్ పన్నని కుట్రను పోలీసులు చేధించారు. శనివారం పలువురిని అరెస్టు చేశారు. ఆదివారం నిందితుడి విచారణలో పలు ఆసక్తికర ఆంశాలు వెలుగులొకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు కోటి రూపాయల సుపారీ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో బీజేపీ అగ్రనేతలు నుపుర్ శర్మ, రాజాసింగ్, ఉపదేశ్ రాణా, సురేశ్ చవాన్కే వంటివారిని హత్య చేయాలని ప్రణాళికలు రచించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు ఈ డబ్బుతో పాక్, నేపాల్ ల నుంచి ఆయుధాలు కూడా తెప్పించుకున్నారని వెల్లడించారు. అరెస్టయిన నిందితుడు పాకిస్థాన్‌తో సహా ఐదు దేశాలతో సంప్రదింపులు జరిపాడని తెలిపారు. పాకిస్థాన్, వియత్నాం, ఇండోనేషియా, కజకిస్తాన్, లావోస్ వంటి వివిధ దేశాల కోడ్‌లను కలిగి ఉన్న వాట్సాప్ నంబర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాడని వివరించారు. భారత్ లో మత విద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను కూడా ఉపయోగించినట్లు తెలిసిందన్నారు. పలు సైట్లలో భారతీయ పతాకాల చిత్రాలను అప్ లోడ్ చేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.