నక్సలిజంలోకి ఝార్ఖండ్​ ను నెట్టారు తల్లుల బాధలను తొలగిస్తాను

ప్రతిపక్షాల ఆటలు సాగనీయను కటిక పేదరికాన్ని అనుభవించాను కాబట్టే ఈతిబాధలు తెలుసు కోడెర్మా బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

May 14, 2024 - 17:53
May 14, 2024 - 18:16
 0
నక్సలిజంలోకి ఝార్ఖండ్​ ను నెట్టారు తల్లుల బాధలను తొలగిస్తాను

రాంచీ: బలహీనమైన ప్రభుత్వాల వల్ల ఝార్ఖండ్​ నక్సలిజంలోకి వ్యూహాత్మకంగా నెట్టివేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మంగళవారం కాశీ సభ అనంతరం ఝార్ఖండ్​ కోడెర్మా ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఎందరో తల్లులు తమ కుమారులు తుపాకులు పట్టుకుంటే తల్లడిల్లిపోయారని అన్నారు. కానీ మోదీ వచ్చాక వీరి ఆటలు సాగడం లేదని ఎందరో తల్లులను బలవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడని అన్నారు. యువతకు ఉపాధి కోసం ఝార్ఖండ్​ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. నక్సలిజాన్ని పూర్తిగా అరికట్టి ఝార్ఖండ్​ లో స్వపరిపాలన అందజేస్తామని మీ ఆశీర్వాదాలు, చల్లని చూపు తనపై ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. తాను కాశీకి ఎంపీని మాత్రమేనని కానీ దేశానికి ప్రధానిని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. 

సవాళ్లను తప్పించుకోవడం తనకు ఇష్టం లేదని ఎదుర్కోవడమే ఇష్టమని మోదీ తెలిపారు. ఉక్కుసంకల్పంతో ముందుకు వెళితే ఏ సమస్య అయినా ఇట్టే తీరిపోతుందని మోదీ తెలిపారు. తాను దేశ ప్రజలకు కూడా ఇదే వివరించేందుకు పదేళ్లుగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలను రక్తపాతం నుంచి విముక్తి కల్పిస్తానని వారిని అభివృద్ధి బాటలో పయనింప చేస్తానని మోదీ హామీనిచ్చారు. 

దశాబ్దాల తరువాత శ్రీనగర్​ లో ఎన్నికల సంబురాలు జరిగాయన్నారు. ఆర్టికల్​ 370 రద్దుతో ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతోందని మోదీ తెలిపారు. దేశ ప్రయోజనాలకు జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీలు విఘాతం కల్పిస్తున్నాయని మోదీ ఆరోపించారు. నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపాలనేదే తన ప్రధాన ఉద్దేశ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 

తాను ఏ రాజకీయ కుటుంబంలో పుట్టలేదు కాబట్టే తనకు నిరుపేదల ఈతిబాధతలు తెలుసన్నారు. చాయ్​ అమ్ముకున్నాను కాబట్టే కటిక పేదరికం తెలుసన్నారు. ఆ పేదరికాన్ని దేశం నుంచి తరిమికొట్టే వరకు మోదీ విశ్రమించబోడని స్పష్టం చేశారు.