తప్పుడు ప్రకటనలతో భారీ మోసం
అడ్వకేట్- కాంపెల్లి ఉదయ్ కాంత్ రేవంత్ రెడ్డికి లేఖ శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ సంస్థపై విచారణ జరపాలి రూ.200 వరకు మోసం
నా తెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంలో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ సంస్థ రూ. 200 కోట్లు భారీ మోసం చేసిందని అడ్వకేట్- కాంపెల్లి ఉదయ్ కాంత్ అన్నారు. ఈ సంస్థపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ మోసంలో 517 మంది బాధితులు ఉండగా అందులో చాలా మంది వృద్ధులు ఉన్నారని చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, మోసపూరిత కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్, సహకారుల గుర్తింపు, కట్టుబడిన నిధుల పునరుద్ధరణ చేయాలని కోరారు. ప్రత్యేక న్యాయ అధికారిని నియమించి దర్యాప్తు సమయంలో పారదర్శకత, న్యాయం చట్ట పరిపాలన పాటించాలని కోరారు. బాధితుల పునరుద్ధరణపై దృష్టి పెట్టి, నష్టపోయిన పెట్టుబడిదారులకు న్యాయపరమైన పరిహారం అందించడంలో సహయం చేయాలన్నారు. తప్పుడు ప్రకటనల ద్వారా మోసం చేసి ప్రజల డిపాజిట్లను తప్పుదోవ పట్టించే భారీ మోసం నిందితుల పరారీలో ఉన్నారని తెలిపారు. బాధితులు ఎఫ్ఐఆర్‌లను, ఆధారాలు సమర్పించినప్పటికీ, స్థానిక దర్యాప్తులో పురోగతి లేదన్నారు.