రైల్వే ఎన్నికల్లో బీఎంఎస్ కు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ మద్దతు
SC and ST association supports BMS in railway elections
నా తెలంగాణ, సికింద్రాబాద్: భారతీయ రైల్వేలో జరుగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ దేశవ్యాప్తంగా బీఎంఎస్ అనుబంధ సంఘాలకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా బుధవారం సికింద్రాబాద్ లోని రైల్ సంచాలన్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో బీఎంఎస్ అనుబంధ సంఘమైన దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం (డీఎంఆర్కేఎస్) కు అల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఈ సందర్బంగా డీఎంఆర్కేఎస్ ప్రధాన కార్యదర్శి శశిధరన్ మాట్లాడుతూ చరిత్రలో ఇప్పటి వరకు ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఏ సంఘానికి మద్దతు నిస్తే ఆ సంఘం విజయపతాకం ఎగురవేసిందని గుర్తు చేశారు. తప్పకుండా తాము కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైల్వేలో పాతపెన్షన్ విధానమే కావాలని మొదట నినదించింది బీఎంఎస్ అని వెల్లడించారు.