రాహల్ వ్యాఖ్యలు దిష్ఠిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ

BJP burnt effigy of Rahul's comments

Sep 12, 2024 - 15:27
 0
రాహల్ వ్యాఖ్యలు దిష్ఠిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ
నా తెలంగాణ, మెదక్​: రాహుల్​ విదేశీ పర్యటనలో వ్యాఖ్యలపై మెదక్​ జిల్లా బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాందాస్​ చౌరస్తాలో నిరసన చేపట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లను రద్దు చేస్తామని రాహుల్​ చెప్పడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగాన్ని కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. దేశ ప్రజలకు భేషరతుగా రాహుల్​ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే ఈ విషయంపై పార్టీని, నాయకులను నిలదీస్తామన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్ఠిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ  జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్​ ఎన్​. రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మండల అధ్యక్షులు ప్రభాకర్, హవేలీ ఘన్​ పూర్​ మండల అధ్యక్షులు రంజీత్ రెడ్డి, సీనియర్ నాయకులు లోకేష్ రాము, విటలేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు పక్కవారి శివ, భాను, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.