బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ఆందోళన

ఇన్​ చార్జీ వీసీ రాజీనామా డిమాండ్​

Sep 8, 2024 - 18:44
 0
బాసర ట్రిపుల్​ ఐటీ విద్యార్థుల ఆందోళన

నా తెలంగాణ, నిర్మల్: బాసర ట్రిపుల్​ ఐటీలో వీసిని నియమించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళన, నిరసనలు ఆదివారానికి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐటీఐలో ఇన్​ చార్జీ వైస్​ చాన్స్​ లర్​ వల్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఐటీఐ ప్రధాన ద్వారం ముందు బైఠాయించి విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేశారు.  ఇన్​ చార్జీ వీసీ వెంకటరమణ నివాసం వద్ద కూడా విద్యార్థులు బైఠాయించి పెద్దపెట్టున ఆయన రాజీనామా చేయాలని ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్​ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు గత కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.