భారత్​ తో పెట్టుకొని అడుక్కుతింటారా?

Are you begging with India?

Nov 3, 2024 - 13:13
Nov 3, 2024 - 13:16
 0
భారత్​ తో పెట్టుకొని అడుక్కుతింటారా?
  • మోదీతో పెట్టుకుంటే డకౌటే!
  • ఇస్లామిక్​ దేశాలకు అన్నమో రామచంద్ర
  • ఇం‘ధన’ గర్వానికి మోదీ చెక్​
  • పూర్తి లెక్కలతో చుక్కలు చూపించిన ప్రధాని
  • రష్యా, బ్రూనైతో ఇంధనం కొనుగోలు ఇస్లామిక్​ దేశాల్లో దడ
  • సగం దేశాలకు మన ఆహారమే
  • పెట్టుబడులు వెనక్కు తీసుకుంటే ఆర్థిక రంగాలు కుదేలే!
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఇం‘ధన’మే సరస్వంగా చెప్పుకుంటూ బీరాలు పోతూ భారత్​ ను భయపెడుతున్న వారికి ప్రధాని మోదీ అసలైన భయం రుచి చూపించారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. భారత విదేశాంగ విధానం అందరితో కలుపుగోలుగా ఉండే విధంగా ఉన్నా, అవసరమైతే తమ శక్తియుక్తుల ప్రదర్శనతోనూ విషం గక్కుతున్న దేశాలను అల్లకల్లోలం చేసే శక్తియుక్తులను కలిగి ఉంది. మోదీ విదేశాంగ నీతి ఇప్పటికిప్పుడేం రూపొందింది కాదు. తరతరాల చరిత్రను ఔపోసన పట్టిన అసలు సిసలైన రాజనీతి. ఈ చాణక్యనీతి వెనుక ప్రపంచమానవాళి మేలుతోపాటు భారత్​ కు కీడు చేసే దేశాల పనిపట్టే విధానం కూడా భేషుగ్గా ఉంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ నీతి అదే దారిలో పయనిస్తున్నది. 
 
ఇం‘ధనం’ ఇస్లామిక్​ దేశాలలో చాలా ఉందని దానితో అన్ని కొనేయగలమనే ధీమాకు భారత్​ ఓ మారు గట్టి సమాధానం కూడా ఇచ్చింది. ఇటు రష్యా, అటూ బ్రూనై దేశాలతో జతకట్టి భారతీయులను చిన్నచూపు చూస్తున్న ఈ ఇస్లామిక్​ దేశాలకు చెంపచెళ్లుమనే సమాధానం ఇచ్చినట్లయ్యింది. ఏ దేశమైన ఆహార ధాన్యాలు, పరిశ్రమలు, వైద్యం, విద్య ఇలా అనేక రంగాల అవసరాలు తీర్చుకునేందుకు ఇతర దేశాలపై ఆధారపడకతప్పదు. కానీ భారత్​ మాత్రం ఆహార రంగంలో అత్యంత పటిష్టంగా ఉండడమే గాక ఒకవిధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్​ సగం దేశాలకు మన ఆహార ధాన్యాలే ఎగుమతి చేస్తుంది. 
 
బీరాలు పోతున్న కుహానావాదులు పెద్ద పెద్ద మాటలు చెబుతూ చరిత్రను వక్రీకరించే పనిలో పడగా, మోదీ విదేశాంగ నీతితో ఆయా దేశాలకు అర్థమయ్యే తీరులో భారతీయుల దెబ్బ రుచి చూపించారు. ఇప్పటికే పాక్​ అడుక్కుంటున్న తీరును కూడా అన్నిదేశాలు గమనిస్తూనే ఉన్నాయి. ఒక్కసారి గనుక భారతీయులు చెయ్యిస్తే ఆ దేశాల ఆర్థిక పరిస్థితి డకౌటే! ఇదే గాకుండా తిండికూడా దొరకని పరిస్థితిలో ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. 
 
ఇస్లామిక్​ దేశాల్లో భారత్​ పవర్​
 
ఖతర్​: ఈ దేశంలో ఆరువేల భారతీయ సంస్థలున్నాయి. 35వేల కోట్లతో అక్కడి ఇన్​ ఫ్​రాస్ర్టక్చర్​, కమ్యూనికేషన్​, ఐటీ, ఎనర్జీ సెంటర్​, మెడికల్​, ఇంజనీరింగ్​, బ్యాంకింగ్​, ఫైనాన్స్​ రంగంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ దేశ జనాభా 30 లక్షలు కాగా ఇక్కడ భారతీయులు 7 లక్షల మంది ఉన్నారు. ఖతర్​ కు లక్ష టన్నుల గోధుమలను భారత్​ పంపిణీ చేస్తుంది. 77వేల మెట్రిక్​ టన్నుల భాస్మతి రైస్​, 25వేల మె.టన్నుల కూరగాయలు, పండ్లు 35వేల మె.టన్నులను సరఫరా చేస్తుంది. 
 
కువైత్​: జనాభా 43 లక్షలు ఉండగా, 10 లక్షల మంది భారతీయులున్నారు. వీరంతా పలు రంగాలలో సేవలందిస్తున్నారు. అత్యధికంగా వైద్యులు, నర్సులు, ఇంజనీర్లు, చార్టెడ్​ అకౌంటెంట్లు, టెక్నీషియన్లు, కూలీలున్నారు. వీరే గాక కువైత్​ ప్రభుత్వంలో నేరుగా 28వేలమంది భారతీయులు ఉద్యోగాలు సాధించడం విశేషం. అంటే ప్రతి రంగంలోనూ భారతీయుల పాత్ర ఉంది. కువైత్ కు 4 లక్షల మెట్రిక్​ టన్నుల గోధుమలు, 1.5 ల. మె.ట.  బాస్మతి రైస్​, 17వేల మె.ట. కూరగాయలు, 30వేల టన్నుల పండ్లు తదితరాలను సరఫరా చేస్తుంది.
 
సౌదీ అరబ్​: సౌదీలో 745 భారతీయ సంస్థలున్నాయి. వీటి విలువ 20వేల బిలియన్​ డాలర్లు. 22 లక్షల మంది భారతయులున్నారు. ప్రతీయేటా భారత్​ నుంచి 2 లక్షల మంది హజ్​ యాత్రకు వెళతారు. 30 శాతం గోధుమలు, బాస్మతి రైస్​ 6.7 లక్షల మె.టన్నులు, 16వేల మె.టన్నుల కూరగాయలు, 16వేల మె.టన్నుల పండ్లు సరఫరా చేస్తుంది. 
 
యూఏఈ: 34 లక్షల జనాభా. భారత పెట్టుబడులు 85బిలియన్​ డాలర్లు. 4.7 లక్షల మె.టన్నుల గోధుమలు, 2.5 లక్షల మె. టన్నుల బాస్మతి రైస్​, 82వేల మె.టన్నుల కూరగాయల, 91వేల మె.టన్నుల పండ్లు సరఫరా చేస్తుంది.
 
బహ్రెయిన్​: 17 లక్షలమంది జనాభాలో 3.5 లక్షల మంది భారతీయులున్నారు. 3వేల పరిశ్రమలు భారత్​ కు చెందినవి. 23 భారతీయ బ్యాంకులున్నాయి. బ్యాంకింగ్​ రంగంలో భారత్​ కీలకంగా నిలుస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే బహ్రెయిన్​ ఆర్థిక రంగానికి ఆయువుపట్టే భారతీయులు.
 
ఒమన్​: 7.5 బిలియన్​ డాలర్లు భారతీయ పెట్టుబడులు. 7.5 లక్షల మంది భారతీయులున్నారు. 92వేల మెట్రిక్​ టన్నుల గోధుమలు, 70వేల మె.టన్నుల బాస్మతి రైస్​, 37 వేల మె.టన్నుల కూరగాయలు, 34 వేల మె.టన్నుల పండ్లు ఎగుమతి చేస్తుంది. 
 
ఇటీవలే గోధుమల సరఫరా ఓ దేశానికి నిలిపివేయడంతో ఆ దేశంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడం మొదలయ్యాయి. దీంతో అత్యున్నతస్థాయి చర్చల తరువాత కరుణించిన భారత్​ తిరిగి గోధుమల సరఫరాను ప్రారంభించింది. భారత్​ విధానాన్ని అన్ని ఇస్లామిక్​ దేశాలు గుర్తెరిగి నడుచుకుంటున్నాయి ఒక్క పాక్​ తప్ప. అందుకే పాక్​ తో విధానపరమైన మార్పులో భారత్​ కనికనికరించడం లేదు. పాక్​ ఉగ్రవాదాన్ని వీడితే తప్ప అడుక్కునే పరిస్థితులు తప్పవన్న సంకేతాన్ని మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గట్టిగానే ఇస్తుంది. 
 
ఇవే గాక పాలు, పన్నీరు, పెరుగు, నెయ్యి, వెన్న లాంటి అనేక తినే పదార్థాలను  ఇస్లామిక్​ దేశాలకు అందజేస్తుంది. ఇరాక్​, ఇరాన్​ లాంటి దేశాలకు కూడా భారత ఆహార రంగమే ఆపన్న హస్తం అందిస్తుంది. ఈ విషయాలన్నీ తెలియక లేదా తెలిసినా భారతీయులను కించపరిచే విధానంతోనూ వారిలో ఐక్యతను దెబ్బతీసేందుకో పలు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారి గనుక భారత్​ ఇస్లామిక్​ దేశాలకు చెయ్యిస్తే కేవలం ఊహించండి పరిస్థితి ఏంటో? ఇస్లామిక్ దేశాల ఆర్థిక రంగం కుదేలు కావడమే గాకుండా, ఆయా దేశాలు కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి దిగజారుతాయి. ఇదే విధానాన్ని ప్రధాని మోదీ విదేశాంగ నీతి ద్వారా ఆయా దేశాలలో ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రధాని దెబ్బకు చాలాదేశాలు ఉగ్రవాదం కంటే మానవాళి మనుగడే ముఖ్యమన్న నీతి సూత్రాన్ని పాటిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచదేశాల్లో భారత్​ ఏంటనే నీతిని అడుగడుగునా చాటిచెబుతూ మనదేశ కీర్తి పతాకాలను చాటడంలో ప్రధాని రణనీతి, రాజనీతి పూర్తిగా సఫలమవుతుందనే చెప్పాలి.