మహాలో కాంగ్రెస్ రెండో జాబితా 23మందికి చోటు
Mahalo Congress second list has place for 23 people
ముంబాయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శనివారం కాంగ్రెస్ పార్టీ 23మందితో రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 48 మంది పేర్లకు చోటు కల్పించింది. మహారాష్ర్టలో ఇప్పటివరకు 71 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టంది. మహావికాస్ అఘాడీ కూటమి 288స్థానాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీలు కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్)లు కలిసి చెరో 90 స్థానాలపై పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించనున్నారు. ఇప్పటికే శివసేన 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఎన్సీపీ 9మంది పేర్లను మాత్రమే ప్రకటించింది.