విభజన కుట్రలకు కాంగ్రెస్​ తెర తుక్కుగూడ విలీనానికి వ్యతిరేకం

బీజేపీ మహేశ్వరం ఇన్​చార్జీ అందెల శ్రీరాములు యాదవ్​

Jun 19, 2024 - 17:57
 0
విభజన కుట్రలకు కాంగ్రెస్​ తెర తుక్కుగూడ విలీనానికి వ్యతిరేకం

నా తెలంగాణ, మహేశ్వరం: తుక్కుగూడ మున్సిపాలిటీని జీహెచ్​ ఎంసీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్​ చార్జీ అందెల శ్రీరాములు యాదవ్​ అన్నారు. మహేశ్వరంలో బీజేపీకి ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకే తుక్కుగూడను విభజించే కుట్రలకు కాంగ్రెస్​ పార్టీ తెరలేపిందని అందెల తెలిపారు. 

బుధవారం తుక్కుగూడను జీహెచ్​ఎంసీలో విలీనం చేయవద్దని మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తుక్కుగూడ మున్సిపాలిటీని చుట్టుపక్క ప్రాంతాలైన ఆదిభట్ల, ఇబ్రహీంపట్నంలలో విలీనం చేయకుండా జీహెచ్​ఎంసీలో భాగమైన ఎక్కడో ఉన్న రాజేంద్ర నగర్​ లో విలీనం చేయడాన్నేతాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్​ ఉనికి కోసం పోరాడుతోందని, ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. అందువల్లే తుక్కుగూడ విభజించాలనే కుట్ర ప్రభుత్వ నిర్ణయంలో దాగి ఉందన్నారు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని అందెల తెలిపారు.

ఇప్పటివరకూ కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఊసే లేదన్నారు. తప్పిదాలన్నీ హస్తం పార్టీ వద్ద పెట్టుకొని విభజన రాజకీయాలకు పాల్పడడం శోచనీయమని దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అందెల తెలిపారు. అంతేగాక తుక్కుగూడ విలీనంతో ఈ ప్రాంత అభివృద్ధి కూడా కుంటుపడే అవకాశం ఉందని అందెల శ్రీరాములు యాదవ్​ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ పలు ప్రాంతాలను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్​ కు కన్నుకుడుతోందని అందెల ఆరోపించారు. 

మున్సిపాలిటీలో వినతిపత్రం అందించిన వారిలో అందెల శ్రీరాములు యాదవ్​ తోపాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూల వీరేందర్ గౌడ్, మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ ఫోర్ లీడర్ శివకుమార్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు రాజమోని రాజు, భాకి విలాస్,  భావన సుధాకర్, బోద యాదగిరి రెడ్డి, పద్మ శివయ్య గౌడ్, కాటం భాస్కర్ గౌడ్, శీను నాయక్, ఆంజనేయులు, రాజు, దేవేందర్ నాయక్, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.