నరసింహారెడ్డి కమిషన్ రద్దుపై హైకోర్టుకు మాజీ సీఎం కేసీఆర్
Former CM KCR to High Court on cancellation of Narasimha Reddy Commission
నా తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన మంగళవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, నూతన థర్మల్ పవర్ ప్లాంట్ లో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ కమిషన్ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే కొనుగోళ్లు చేపట్టామన్నారు. ఇప్పటికే ఈ కమిషన్ 25 మంది అధికారులను విచారించింది. కేసీఆర్ కూడా ఈ కమిషన్ ముందు హాజరై విద్యుత్ కొనుగోళ్లపై పలు వివరాలను అందించాలని ఈ కమిషన్ నోటీసులు జారీ చేసింది.