బ్రెజిల్ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం
భారతీయుల స్వాగతంపై హర్షం
జీ–20లో కీలక చర్చలకు సిద్ధం
రియో డి జెనీరో: బ్రెజిల్ తో ఫలప్రద చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారతీయ సమాజం ఆత్మీయ, ఉత్సాహభరిత స్వాగతంపై హర్షం వ్యక్తం చేశారు. జీ–20లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోకు చేరుకున్నారు. బ్రెజిల్ లో అధ్యక్ష కార్యాలయం అధికారులు, భారతీయ కమ్యూనిటీ ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసిఓ లూలా డ సిల్వా నిర్వహిస్తున్న జీ20లో పాల్గొననున్నారు.
ఈ శిఖరాగ్ర చర్చలు, ఉత్పాదకతలను మరింత పెంపొందిస్తాయని ఆకాంక్షించారు. గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. ఒకే భూమి, ఒకే కుటుంబ, ఒక భవిష్యత్తు అనే భారత దృక్పథాన్ని బ్రెజిల్ ముందుకు తీసుకుపోవడాన్ని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాల్లో ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలు మరింత ఆదర్శవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.
గయానా పర్యటన..
ఈ సదస్సు అనంతరం 19 నుంచి 21 వరకు ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. 1968 తరువాత గయానాలో భారత్ ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కానుండడం గమనార్హం. గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు పర్యటించనున్నారు. ఈ దేశంతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. పార్లమెంట్‌లోనూ ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. భారతదేశంలోని ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివస్‌కు గయానా అధ్యక్షుడు అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.