మద్యం కుంభకోణం సీఎం కేజ్రీ అక్రమ అరెస్టు పిటిషన్​ తిరస్కరణ

మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్​ కు మరోసారి కోర్టు ఝలక్​ ఇచ్చింది. అక్రమ అరెస్టుపై ఆయన వేసుకున్న పిటిషన్​ ను విచారణకు తిరస్కరించింది.

Apr 9, 2024 - 16:50
 0
మద్యం కుంభకోణం సీఎం కేజ్రీ అక్రమ అరెస్టు పిటిషన్​ తిరస్కరణ

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్​ కు మరోసారి కోర్టు ఝలక్​ ఇచ్చింది. అక్రమ అరెస్టుపై ఆయన వేసుకున్న పిటిషన్​ ను విచారణకు తిరస్కరించింది. మంగళవారం ఈ పిటిషన్​ విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు తిరస్కరిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. జస్టిస్ స్వరణ్ కాంత్ శర్మ పిటిషన్‌ పై విచారించారు. ఈడీ ప్రకారం కేసీఆర్​ కుట్రల పాల్గొన్నట్లు అనుమానాలున్నాయని ఈడీ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కోర్టు పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన సాక్షులను అనుమానించడం కోర్టును కూడా అనుమానించినట్లేనని పేర్కొంది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్, బెంచ్ గతంలో కూడా ఇలాంటి పిటిషన్లను విచారించిందని చెప్పారు. ఇలాంటి కేసులన్నింటినీ కలిపి విచారించాలని ఇటీవల ధర్మాసనం ఆ పిటిషన్‌లను బదిలీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇడి అరెస్టు, నిర్బంధాన్ని సవాల్​ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.