గోవర్ధన్​ పూజపై దాడి

చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశాలు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

Nov 3, 2024 - 15:24
 0
గోవర్ధన్​ పూజపై దాడి

లక్నో: యూపీ ముజఫర్​ పూర్​ లోని గోవర్ధన్​ పూజ నిర్వహిస్తున్న బ్రాహ్మణ కుటుంబంపై ముస్లిం వర్గానికి చెందిన కొందరు యువకులు దాడి చేశారు. వారిని కొట్టి పూజ సామాగ్రిని అపవిత్రం చేశారు. ఈ విషయం పై బాధితులు వెంటనే స్థానికంగా ఉన్న హిందువులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కపిల్​ దేవ్​ అగర్వాల్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించారు. పోలీసులు దాడికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. 

బాధితుల ఆవేదన..

ముజఫర్‌నగర్‌లోని సివిల్‌ లైన్స్‌ లో బ్రాహ్మణ కుటుంబం తమ ఇంట్లో గోవర్ధన్​ పూజ నిర్వహిస్తుంది. ఈ సమయంలో స్థానికంగా ఉండే కొందరు ముస్లిం యువకులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దూషిస్తూ ఇంటిపెద్దపై దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన ఆయన కుటుంబ సభ్యులు, యువతులను దూషించారు. కుటుంబం కేకలు వేయడం స్థానికులు గూమికూడడంతో వారు తప్పించుకొని పారిపోయారు. వెంటనే స్థానికులు ఎమ్మెల్యే కపిల్ దేవ్​ అగర్వాల్​ కు, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు గాయాలపాలైన ఇంటియజమానిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందజేస్తున్నారు. తమ తండ్రి లేకపోవడంతో తాత, అక్కలు, తనపై దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులలో ఒకరైన బాలుడు పోలీసులకు వివరించాడు తమ ఇళ్లు అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని, ప్రతీ పండుగ నిర్వహణలోనూ ఇలాంటి అడ్డంకులను సృష్టిస్తున్నారని యాజమానులు ఆరోపించారు. 

సివిలైన్స్​ పోలీస్​ స్టేషన అధికారి వ్యోమ్ బిందాల్​ మాట్లాడుతూ.. దాడి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లామన్నారు. స్థానికుల ద్వారా వివరాలను సేకరించి నిందితుడిని అరెస్టు చేశామన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. పుకార్లను నమ్మవద్దన్నారు.