మహిళాభివృద్ధికి ఎన్ సీడీసీ రూ. 708 కోట్లు
రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహిళాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎసీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ద్వారా రూ, 708 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు కేంద్ర హోంశాఖ, సహకార మంత్రి అమిత్ షా రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దేశంలో 25,385 మహిళా సంక్షేమ సహకార సంఘాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఘాల ద్వారా సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడంలో ఎన్ సీడీసీ గణనీయమైన పాత్ర పోషిస్తోందన్నారు. అదే సమయంలో మహిళలు వ్యాపార కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుదని, వీలు కల్పిస్తుందన్నారు. సహకార సంఘాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని షా చెప్పారు. దేశంలో లక్షా 44 వేల పాడి సహకార సంఘాలు ఉన్నాయని, గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో ఈ రంగంలో నిమగ్నమై ఉన్నారని మంత్రి తెలిపారు.