పేదరికాన్ని తరిమికొడతాం
ఒక్కటై సమస్యలను పరిష్కరిద్దాం
భారత్ విధానంతో ముందుకు వెళదాం
రియోడిజెనిరో: బ్రెజిల్ రాజధాని రియోడిజెనిరోలో రెండో రోజుల జీ–20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలు, పీఎంలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రపంచదేశాల్లోని యుద్ధ పరిస్థితులను, అనిశ్చితి పరిస్థితులను తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలికేకలను తగ్గించాలన్నారు. భారత్‌లో తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల పేదరికాన్ని తగ్గించగలిగామన్నారు. ప్రస్తుతం ఏ ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. నిరుపేదలందరికీ ఉచితంగానే రేషన్ అందించబడింది. ప్రపంచదేశాల్లోని ఆకలికేకలు వినిపిస్తున్న దేశాల్లో కూడా ఇలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు భారత్ సిద్ధంగా ఉంది. ప్రపంచంలోని పేదరికాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో ప్రపంచదేశాలను కాలుష్యం కలవరపెడుతుందని, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్నారు. అనేక సమస్యల పరిష్కారానికి ప్రపంచదేశాలన్నీ కృషి చేయాల్సిన అవసరం ఉంది. వైశ్విక కుటుంబం భారత్ గురించి ప్రపంచదేశాలు అనుసరించాల్సిన అవసరం ఉంది.
బ్రిటన్ పీఎం స్టార్మర్ ను కలిశారు. భారత్–యూకెల మధ్య ఎఫ్ టీఈ (ఫ్రీ ట్రెండ్ ఎగ్రిమెంట్)పై చర్చించారు. మాంచెస్టర్‌లో రెండు భారత రాయబార కార్యాలయాలను తెరవడం జరిగింది.
ఫ్రాన్స్ రాష్ట్రపతి ఇమ్మాన్యుయెల్ మైక్రాన్ తో కలిశారు. పారా ఒలింపిక్స్ విజయవంతంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
పీఎం మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనిని కలిశారు. రెండేళ్లలో వీరిద్దరు ఐదుసార్లు కలిశారు. వ్యాపారం, ఇన్నోవేషన్, విద్య, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, అంతరిక్షం, డిఫెన్స్ రంగాలపై చర్చించారు.
ఇండోనేషియా రాష్ట్రపతి ప్రభోవో సుభియాంతోను కలిశారు. తనిఖీపతి తమ దేశానికి వైద్యులను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. వ్యాపారం, ఇన్నోవేషన్, రక్షణ, భద్రత, పర్యాటకం, ఆరోగ్య రంగాలలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.
నార్వే ప్రధాని జోనాస్ స్టోర్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రీఎన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీపై ఇరువురు చర్చించారు.
పోర్చుగల్ ప్రధాని లూయిస్ మోంటెనెగ్రోతో కలిశారు. ఇరుదేశాల్లోని ఆర్థిక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. రీ ఎన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లపై చర్చలు జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా, స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచెజ్, సింగపూర్ పీఎం లారెన్స్ వాంగ్, యూఎన్ సెక్రెటరీ జనరల్ ఎంటోనియో గూటెరస్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుకూ, యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డేర్ లెయెన్, ఈజిప్ట్ నిర్దేశపతి అబ్దెల్ ఫతేహ్ అల్ సీసీలతో కలిసి పలు అంశాలపై చర్చించారు.
జీ–20 నిర్వహణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఐదు అంశాలను ప్రసంగించారు.
– ఆహార సంక్షోభంపై ప్రపంచాలన్నీ ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. నిరుపేద దేశాల్లోని ప్రజల ఆకలి తీర్చే అవసరం.
– ఒకే భూమి, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్ అనే నినాదంతో ఈ సదస్సును మరింత ముందుకు తీసుకువెళ్లామన్నారు. బలపరుద్దమన్నారు.
– జీ–20లో ఆఫ్‌రికా దేశాలకు భాగస్వామ్యం కల్పించినట్లు, మిగిలిన సదస్సుల్లో కూడా ఆ దేశాలకు అవకాశం కల్పిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామన్నారు.
– ప్రపంచదేశాల్లో యుద్ధాల వల్ల ఆహార పదార్థాలు, ఇంధనం సంక్షోభం తలెత్తింది. గ్లోబల్ సౌత్ దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తగ్గించేందుకు మార్గాలను అన్వేషించి చర్యలు చేపట్టాలి.
– గ్లోబల్ సౌత్ దేశాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించినప్పుడు జీ–20 సదస్సు లక్ష్యాలను చేరుకుంటామని ప్రధాని మోదీ ప్రపంచదేశాలకు వెళ్లారు.
సదస్సులోని తీర్మానాలు
సంపన్నవర్గాలు 2 శాతం ట్యాక్స్ విధించాలి.
2030 వరకు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందిని దారిద్ర్యరేఖ నుంచి ఆర్థిక స్థితి చేకూర్చేలా చర్యలు చేపట్టాలి.
యూఎన్ ఎసీలో దక్షిణాఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు ప్రాబల్యం వహించే అవకాశం ఇవ్వాలి.
యుద్ధాలను విరమింప చేసే ప్రయత్నాలను తీవ్ర తరం చేయడం.
గాజా, లెబనాన్ సీజ్ ఫైర్ లో సామాన్యుల రక్షణకు భద్రతా చర్యలు చేపట్టడం.
ప్రపంచదేశాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన విషయాలను చర్చించాలి.
ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) డిప్యూటీ డైరెక్టర్ గీత గోపీనాథ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.