ఇస్రో జీశాట్​–2 సక్సెస్

​ మస్క్​ స్పేస్​ ఎక్స్​ ద్వారా ప్రయోగం విజయవంతం

Nov 19, 2024 - 15:20
 0
ఇస్రో జీశాట్​–2 సక్సెస్

ఫ్లోరిడా: ఎలన్​ మస్క్​ స్పేస్​ ఎక్స్​ ఇస్రోకు చెందిన జీశాట్​–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. మంగళవారం అమెరికా ఫ్లోరిడాలోని కేప్​ కెనారావెల్​ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టి విజయం సాధించింది. భారత్​ కు చెందిన జీశాట్​–2 ద్వారా తొలిసారిగా కెఎ బ్యాండ్​ ఫ్​రీక్వెన్సీని ఉపయోగించి రూపొందించిన ఉపగ్రహం. దీని ఫ్​రీక్వెన్సీ పరిధి 27 నుంచి 40 గిగాహెర్ట్జ్​ లు. అధిక బ్యాండ్​ విడ్త్​ తో భారత్​ లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ ను అందజేసేందుకు ఈ ఉపగ్రహం కీలకంగా నిలవనుంది. అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారికి కూడా ఈ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్​ ను అందించే అవకాశం ఉంది. స్పేస్​ ఏజెన్సీ, ఇస్రోలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా ఉన్నాయి. స్పేస్​ ఎక్స్​ రూపొందించిన ఫాల్కన్​ 9 ద్వారా ఇస్రో రూపొందించిన ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహం బరువు 4700కిలోలు.