డ్యూటీ సమయం ముగిసిందని విమానం వదిలి వెళ్లిన పైలెట్​!

ఎయిర్​ ఇండియాపై ప్రయాణికుల ఆగ్రహం

Nov 19, 2024 - 13:59
 0
డ్యూటీ సమయం ముగిసిందని విమానం వదిలి వెళ్లిన పైలెట్​!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: డ్యూటీ సమయం ముగిసిందన్న కారణంలో పైలెట్​ విమానాన్ని జైపూర్​ లో వదిలి వెళ్లిపోయాడు. దీంతో విమానంలో ఉన్న 180మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై ఎయిర్​ ఇండియా నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పారిస్​ నుంచి ఢిల్లీకి ఎయిర్​ ఇండియా విమానం ఎఐ–2022 ఆదివారం రాత్రి 10 గంటలకు బయలుదేరింది. సోమవారం ఉదయం 10.35 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా అధికారుల సూచనల మేరకు విమానాన్ని జైపూర్​ లో పైలెట్​ 12.10 గంటలకు ల్యాండ్​ చేశారు. ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​ సిస్టమ్​ నుంచి క్లియరెన్స్​ కోసం జైపూర్​ లో వేచి చూశారు. మధ్యాహ్నం వరకు క్లియరెన్స్​ లభించకపోవడంతో పైలెట్​ తన డ్యూటీ టైం పూర్తయిందని సిబ్బందికి తెలిపి విమానాన్ని వదిలివెళ్లాడు. దీంతో 180 మంది ప్రయాణికులు సోమవారం రాత్రి 9 గంటల వరకు జైపూర్​  విమానాశ్రయంలో ఇబ్బందులు పడ్డారు. ఎయిర్​ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తేరుకున్న అధికారులు ప్రయాణికులను ప్రత్యేక వాహనాల్లో ఢిల్లీకి చేర్చారు. మరికొందరు తమ తమ ప్రైవేట్​ వాహనాల్లో తమ మార్గాలకు పయనమయ్యారు.