చమురు కొనుగోళ్లలో చైనాను మించిన భారత్
India surpasses China in oil purchases
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: చమురు కొనుగోళ్లలో భారత్ చైనాను వెనక్కు నెట్టింది. గురువారం ఈ మేరకు జూలై చమురు కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను వాణిజ్యం, పరిశ్రమల శాఖ నివేదిక విడుదల చేసింది.
జూలైలో రోజుకు 2.70 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. అదే సమయంలో చైనా రోజుకు 1.76 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే కొనుగోలు చేసింది. అమెరికా, ప్రపంచదేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్ అన్ని దేశాలతోనే వ్యూహాత్మక భాగస్వామ్యం వ్యవహరిస్తూ రష్యా నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేయగలుగుతుంది. జూలై లెక్కల ప్రకారం రష్యా నుంచి 44 శాతం చమురును భారత్ కొనుగోలు చేస్తుంది. ఇది అత్యధిక వాటా కావడం గమనార్హం. రష్యా తరువాత ఇరాక్, సౌదీల నుంచి భారత్ అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తోంది.