నా తెలంగాణ, ఆదిలాబాద్: రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ లో నియోజక వర్గ కాంగ్రెస్ శ్రేణులతో శుక్రవారం సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ప్రత్యేక అభివృద్ధిపై దృష్టి పెట్టారని తెలిపారు. సీఎం నేతృత్వంలోని మంత్రి వర్గ బృందం ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి రూ. 14 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేటీఆర్, జోగురామన్న వ్యాఖ్యలపై నిరసన..దిష్ఠిబొమ్మ దగ్ధం..
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేత జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేటీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేశారు. సీఎంను పరుష పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ దురహంకారానికి పరాకాష్ఠగా నిలుస్తున్నాయని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, సయీద్ ఖాన్, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుడిపల్లి నగేష్ , గిమ్మ సంతోష్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి, ఎం.ఏ షకీల్, మావల ఎంపీపీ దర్శనాల సంగీత - ఏవన్, ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్, ఆవుల వెంకన్న, దర్శనాల లక్ష్మణ్, భూమన్న, సంద నర్సింగ్, జాఫర్ అహ్మద్, బండి దేవిదాస్ చారి, సుఖేందర్, చిన్నయ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, నాయకులు సింగిరెడ్డి రామ్ రెడ్డి, పోరెడ్డి కిషన్, బూర్ల శంకరయ్య, ఎం.ఏ ఖయ్యుమ్, షౌకత్ అలీ, పోరెడ్డి శంకర్, యెల్టీ భోజా రెడ్డి, సుధాకర్ గౌడ్, తుమ్మ ప్రకాశ్, విఠల్, శ్రీలేఖ, ఉమామహేశ్వరి, దేశెట్టి ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.