బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే బాలీవుడ్ ఛాన్స్

అసలే బాలీవుడ్ లో నెపొటిజం ఎక్కువ అంటూ అక్కడ ఆడియన్స్ స్టార్ సినిమాలపై విపరీతమైన వ్యతిరేకత చూపిస్తున్నారు.

Apr 20, 2024 - 15:01
 0
బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే బాలీవుడ్ ఛాన్స్

అసలే బాలీవుడ్ లో నెపొటిజం ఎక్కువ అంటూ అక్కడ ఆడియన్స్ స్టార్ సినిమాలపై విపరీతమైన వ్యతిరేకత చూపిస్తున్నారు. యువ హీరోలకు ఛాన్సులు రాకుండా తెరవెనుక జరిగే ప్రక్రియలకు ఎంతోమంది కెరీర్ ను కోల్పోతున్నారు. బాలీవుడ్ లో రాణించాలంటే అక్కడ బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సినే అన్న టాక్ తెలిసిందే. ఇప్పుడు అదే మాట ఒక స్టార్ హీరోయిన్ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సినీ పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోద్ది అనుకుంటే పొరబడినట్టే. టాలెంట్ తో పాటు లక్ కలిసి వస్తేనే పరిశ్రమలో రాణించగలుగుతారు. అయితే బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే మాత్రం కేవలం టాలెంట్ ఒక్కటే కాదు బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండాలని అంటుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా. సొట్ట బుగల చిన్నదిగా నిన్నటి తరం సినీ ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన ప్రీతి జింటా రీసెంట్ గా బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.  బాలీవుడ్ లో అవకాశాలు రావాలన్నా.. ఇక్కడ సినిమాల్లో రాణించాలన్నా సరే బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిందే అంటుంది ప్రీతి జింటా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారికి బాలీవుడ్ సురక్షితం కాదని అంటుంది. సినిమా వాళ్లే కాదు ఏదో ఒక విధంగా బ్యాక్ గ్రౌండ్ ఉండి తీరాలి.. ప్రముఖులతో పరిచయాలు ఉండాల్సిందే.. అలాంటి వాళ్లు మాత్రమే బాలీవుడ్ లో నెగ్గుకు వస్తారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే మాత్రం రోడ్డు మధ్యలో నిల్చొని ఉంటే ఏ కారు ఢీ కొడుతుందో అని భయపడుతున్నట్టు ఉంటుంది అంటుంది ప్రీతి జింటా.  ఇప్పటికే బాలీవుడ్ అంతా కూడా నెపొటిజంతో నిండిపోయిందని అక్కడ ఆడియన్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. వారికి ఊతమిచ్చేలా ఇప్పుడు ప్రీతి జింటా కూడా బ్యాక్ గ్రౌండ్ లేనిదే బాలీవుడ్ లో కొనసాగడం కష్టమని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దిల్ సే సినిమాతో వెండితెరకు పరిచయమైన ప్రీతి జింటా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మెప్పిస్తూ వచ్చింది. తెలుగులో కూడా ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాల్లో నటించింది ప్రీతి జింటా. బాలీవుడ్ సినిమాలతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ప్రీతి జింటా తన అనుభవంతో ఈ కామెంట్స్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడ సినీ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.