అభిమానులే ఆమెకు ‘బలగం’
గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన పిల్లికళ్ల చిన్నారిని అంత ఈజీగా ఎవరూ మరిచిపోరు.
గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన పిల్లికళ్ల చిన్నారిని అంత ఈజీగా ఎవరూ మరిచిపోరు. ప్రస్తుతం ఆ చిన్నారి హీరోయిన్ గా టాలీవుడ్ లో బిజీ అయ్యేలా అడుగులు వేస్తోంది. ఈమె అసలు పేరు కావ్య కళ్యాణ్ రామ్. మాసూద అనే హర్రర్ మూవీతో హీరోయిన్ గా సక్సెస్ కొట్టి లక్కీ గర్ల్ అనిపించుకుంది. తరువాత బలగం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఆమె చేస్తున్న సినిమాలు వరసగా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతల ఫోకస్ కావ్య కళ్యాణ్ రామ్ మీద పడింది. బలగం తర్వాత ఉస్తాద్ అనే సినిమాలో శ్రీసింహకి జోడీగా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈమె హీరోయిన్ గా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయంట. ఓ చెలియా అంటూ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో కూడా ఆకట్టుకుంది. కావ్య కళ్యాణ్ రామ్ సినిమాలకు ఈ మధ్య గ్యాప్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. క్యూట్ లుక్స్ తో బాబ్లీగా ఉండే కావ్యని ఇన్ స్టాగ్రామ్ లో 3.61 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ గ్లామరస్ ఫోటోషూట్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించింది. ఇందలో నడుము అందాలు కనిపించేలా అదిరిపోయే భంగిమలతో పోజులు ఇచ్చింది. ఈ స్టిల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ లో చాలా ఘాటుగా గా ఉన్నారంటూ నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్ ప్రెషన్ అద్భుతంగా ఉందంటూ కిల్లర్ లుక్స్ అని పలువురు పాజిటివ్ గా ప్రశంసిస్తున్నారు. అలాగే ఆమె నుంచి హీరోయిన్ గా నెక్స్ట్ రాబోయే సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అమ్మడు గతంలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా చేయాలనుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అలాంటి స్టార్ తో జతకట్టే అవకాశం కావ్యకి వస్తే కచ్చితం స్టార్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా. ఇక మొన్నటి వరకు కాస్త బబ్లీ గా కనిపించిన కావ్య తాజాగా షేర్ చేసిన పిక్స్ లో కాస్త స్లిమ్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ లుక్స్ ద్వారా అమ్మడు కొత్త ప్రాజెక్ట్స్ లలో ఛాన్స్ లు అందుకుంటుందో లేదో చూడాలి.