చొరబడేందుకు సిద్ధంగా 150 మంది ఉగ్రవాదులు!

ఇంటలిజెన్స్​ సమాచారాన్ని పంచుకున్న బీఎస్​ ఎఫ్​ అధికారి

Oct 11, 2024 - 17:28
 0
చొరబడేందుకు సిద్ధంగా 150  మంది ఉగ్రవాదులు!

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ సరిహద్దు వెంట భారీ చొరబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 150 మంది వరకు ఉగ్రవాదులు సరిహద్దు లాంచింగ్​ ప్యాడ్​ వద్ద వేచి ఉన్నట్లు ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. ఈ విషయాన్ని బీఎస్​ ఎఫ్​ ఆర్మీ ఉన్నతాధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు. చలికాలం సమీపిస్తుండడంతో ఉగ్రవాదులు సరిహద్దుల ద్వారా జమ్మూకశ్మీర్​, దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వీరి ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. 

కేంద్ర నిఘా వర్గాలు, ఇంటలిజెన్స్​ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని తెలిపారు. ఏజెన్సీల ద్వారా అందిన సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాలపై నిఘా ముమ్మరం చేశామన్నారు. ఉగ్రకదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్​ చేస్తున్నామని తెలిపారు. సరిహద్దు భద్రతపై ఆర్మీ, పోలీసులు కలిసి సంయుక్తంగా పనిచేస్తున్నాయన్నారు. జమ్మూకశ్మీర్​ ఎన్నికల్లో కూడా చొరబడి విధ్వంసం సృష్టించేందుకు దుష్ట పన్నాగాలు పన్నినా వాటన్నింటినీ తిప్పి కొట్టి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.