అరెస్టుపై చట్టబద్ధ విచారణ? సోరెన్​ న్యాయవాదులకు సుప్రీం ప్రశ్న?

కేసు వాయిదా

May 21, 2024 - 17:49
 0
అరెస్టుపై చట్టబద్ధ విచారణ? సోరెన్​ న్యాయవాదులకు సుప్రీం ప్రశ్న?

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఝార్ఖండ్​ మాజీ సీఎం హేమంత్​ సోరెన్​ అరెస్టును కోర్టు చట్టబద్ధంగా పరిశీలించి విచారణ చేపట్టొచ్చా అని ఆయన తరపు న్యాయవాదులు కపిల్​ సిబాల్​, అరుణాభ్ చౌదరిలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మంగళవారం ఈ కేసు సుప్రీంలో విచారణకొచ్చింది. సోరెన్​ మధ్యంతర బెయిల్​ ను ఇప్పటికే ట్రయల్​ కోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్​ పిటిషన్​ ఇప్పటికే ట్రయల్​ కోర్టులో తిరస్కరించారని, ఈ సమయంలో మధ్యంతర బెయిల్​ ఇవ్వొచ్చా అనే దానిపై విచారిస్తామని ఈ విషయంపై సమాధానం చెప్పాలని న్యాయవాదులకు సూచించింది. కాగా న్యాయవాదులు బుధవారం వరకు సుప్రీంను గడువు కోరడంతో కేసును వాయిదా వేసింది. ఈ పిటిషన్​ ను ద్విసభ్య జస్టిస్​ దీపాంకర్​ దత్తా, జస్టిస్​ సతీష్​ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ఎన్నికల సమయంలో పలువురికి మధ్యంతర బెయిల్​ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోరెన్​ కూడా ఎన్నికల ప్రచారంలో, పార్టీ తరఫున సేవలు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్​ కోసం సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేశారు.