ఆప్ పై చర్యలు ఢిల్లీ ఎల్జీ
Actions against AAP by Delhi LG
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎల్జీ (లెఫ్ట్ నెంట్ గవర్నర్)పై ఆప మహిళా నాయకురాలు అతిషి తీవ్ర ఆరోపణలపై ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలపై చర్యలుంటాయని శనివారం ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో ఓటు హక్కు వేసిన అతిషి మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులతో ఎల్జీ సమావేశం జరిపారన్నారు. ఈ సమావేశంలో ఆప్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ను నెమ్మదించేలా చర్యలు తీసుకోవాలన్నారని ఆరోపించారు. దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ.. పోలింగ్ ఈసీ పరిధిలోని అంశమన్నారు. దాన్ని ఎవ్వరూ నెమ్మదించలేరన్నారు. ఓటర్లంతా ఉత్సాహంతో ఓటింగ్ లో పాల్గొంటుంటే లేని పోని ఆరోపణలు చేస్తూ తమపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అతిషి ఆరోపణలపై చర్యలుంటాయని ఎల్జీ స్పష్టం చేశారు.