కొండచరియలు, రోడ్లకు నష్టం
శాశ్వత పరిష్కారమార్గాలు వెతకాలి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడడం, రోడ్లకు నష్టం వాటిల్లడం లాంటి వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను వెతకాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో జరిగిన టన్నెలింగ్ ఇండియా రెండో ఎడిషన్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టన్నెలింగ్ అభివృద్ధిపై ఫిక్కి, క్రిసిల్ నాలెడ్జ్ నివేదికను గడ్కరీ ఆవిష్కరించారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన రోడ్లను నిర్మించే అవశ్యకత వైపు దృష్టి సారించాలన్నారు. నూతనంగా చేపడుతున్న ప్రాజెక్టుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి దిశగా వెళుతోందన్నారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం బీఆర్ వో లెఫ్ట్ నెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. దేశంలో టన్నెలింగ్ ల నిర్మాణాల ద్వారా అనేక ప్రాంతాల కనెక్టివిటీ మెరుగుపడుతుందన్నారు. దీంతో దూరాభారాలు తగ్గడమే గాకుండా సరిహద్దులోని చివరి గ్రామాల వారికి కూడా తోడ్పాటు లభిస్తుందన్నారు.