అయోధ్య రాంలీలా వీక్షకుల సంఖ్య 41 కోట్లు!

Ayodhya Ramlila has 41 crore viewers!

Oct 7, 2024 - 15:04
 0
అయోధ్య రాంలీలా వీక్షకుల సంఖ్య 41 కోట్లు!

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ
26 భాషల్లో ప్రదర్శితం
50 కోట్లు దాటుతుందని అంచనా!

అయోధ్య: అయోధ్య రాంలీలాను కేవలం మూడు రోజుల్లోనే 41కోట్లమందికిపైగా ఆన్​ లైన్​ మాధ్యమంగా వీక్షించారు. రాముని జీవితమే ఇతివృత్తంగా నిర్మిమైన ఈ కార్యక్రమానికి అన్నిదేశాల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 40 దేశాల్లో ఈ కార్యక్రమం ప్రసారితమవుతుంది. ఈ సందర్భంగా సోమవారం కార్యక్రమాన్ని రూపొందించిన సుభాష్​ మాలిక్​ మాట్లాడుతూ 2020లో అయోధ్యలో సినీ కళాకారులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈయేట అన్ని రికార్డులను బద్ధలు కొడుతూ వీక్షకులను సంపాదించుకోవడం అదృష్టమన్నారు. 50 కోట్లు వీక్షకుల సంఖ్​య దాటే అవకాశం ఉందన్నారు. దూరదర్శన్​ లో 22 కోట్లు, యూట్యూబ్​ లో 17 కోట్లు, ఇతర ఫ్లాట్​ ఫారమ్​ లలో రెండు కోట్ల మంది రాంలీలాను వీక్షించారన్నారు. 26 భాషల్లో ఈ కార్యక్రమాన్ని ప్రదర్శింపచేస్తున్నామని తెలిపారు. 

అయోధ్య రాంలీలా కార్యక్రమాన్ని 2020లో 16 కోట్లమంది వీక్షించగా, 2021లో 22 కోట్లు, 2022లో 25 కోట్లు, 2023లో 40 కోట్లు, 2024లో కేవలం మూడు రోజుల్లోనే 41 కోట్లు దాటడం విశేషం.