లోయలో భారీ దాడి కుట్ర భగ్నం

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్​

Oct 19, 2024 - 14:07
 0
లోయలో భారీ దాడి కుట్ర భగ్నం

శ్రీనగర్​:  జమ్మూకశ్మీర్​ లో భారీ ఉగ్ర దాడిని పోలీసులు భగ్నం చేశారు. పాక్​ తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను శనివారం అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద యెత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు లోయలో భారీ దాడికి ప్రణాళికలు రచించినట్లు గుర్తించారు. పోలీసు అధికారుల వివరాల ప్రకారం ఘజనీ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు చాలా కాలంగా పూంచ్‌లో దాక్కున్నారు. వీరు పాక్​ ఆవలి వైపు ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. లోయలో భారీ దాడి చేయాలని భావించారు. ఉగ్రవాదులు ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నారు? వీరెవరు? ఇలాంటి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఆయా విషయాలపై వీరిని ఇంకా విచారించాల్సి ఉందన్నారు.